ETV Bharat / sukhibhava

సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? - ఆయుర్వేదం ఏం చెబుతుంది!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 28, 2023, 5:05 PM IST

Custard Apple
Custard Apple

Eating Custard Apple Can Cause Cold? : సీతాఫలం.. దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండులో ఎన్నో పోషకాలుంటాయి. అయితే.. చాలా మందికి సీతాఫలం తింటే జలుబు చేస్తుంది? అనే సందేహం వస్తుంటుంది. మరి దీనిలో నిజమెంత? అబద్ధమెంత? ఆయుర్వేదం ఏం చెబుతుందో ఇప్పుడు చూద్దాం..

Health Benefits of Custard Apple : ప్రకృతిలో కొన్ని రకాల పండ్లు సంవత్సరం మొత్తం లభిస్తే మరి కొన్ని రకాల పండ్లు ప్రత్యేక సీజన్‌లో మాత్రమే దొరుకుతాయి. పండ్లు తినడం వల్ల ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలున్నాయనుకుంటే.. అందులో సీజనల్ ఫ్రూట్స్ మరింత ఎక్కువ లబ్ధి చేకూరుస్తాయి. అందుకే సీజనల్ ఫ్రూట్ ఎప్పుడూ వదలకూడదంటారు. మనిషి సంపూర్ణ ఆరోగ్యం కోసం ఏ సీజన్‌లో లభించే పండ్లను ఆ సీజన్‌లో తప్పకుండా తీసుకోవాలి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తోంది. శీతాకాలం అనగానే వెంటనే గుర్తొచ్చే అద్భుతమైన ఫ్రూట్ సీతాఫలం. ఇది రుచిలో ఎంత తీపిగా ఉంటుందో ఆరోగ్యపరంగా అంత మంచిది. శరీరానికి చాలా చలవ చేసే ఫ్రూట్ ఇది. ఇందులో సమృద్ధిగా లభించే విటమిన్ బి డోపమైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ గణనీయంగా పెరుగుతుంది.

కాగా, దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే! ఎంత తిన్నా తనివి తీరని ఈ పండు ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. ఈ పండ్లని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టపడతారు. అయితే ఎంతో తియ్యగా ఉండే సీతాఫలం(Custard Apple)లో చక్కెర తప్ప ఇంకేదీ ఉండదని.. తింటే జలుబు చేస్తుందని ప్రచారం చేస్తుంటారు కొందరు. నిజంగా ఈ పండు తింటే జలుబు చేస్తుందా? ఆయుర్వేదం ఏం చెబుతోంది? ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి? అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

సీతాఫలం తింటే జలుబు చేస్తుందా? : ప్రకృతిలో లభించే చల్లని పండు సీతాఫలం. ఈ పండు మన శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. దీంతో ఇది తింటే సర్ధి అవుతుందనుకుంటారు. కానీ, నిజానికి పండ్లు జలుబు చేయవనే విషయాన్ని చాలామంది అర్థం చేసుకోరు. సాధారణంగా జలుబు వైరస్‌ల వల్ల మాత్రమే వస్తుంది. కొన్ని రకాల పండ్లను తినడం ద్వారా సంక్రమించదనే విషయం గుర్తుంచుకోవాలి. సీతాఫలం జలుబుకు కారణమవుతుందనేది అపోహ మాత్రమే అని ఆయుర్వేదం చెబుతుంది.

మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయమేమిటంటే.. చల్లని ఆహార పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తాయని తెలిసినప్పటికీ.. ఇవి ఒకేసారి అధిక పరిమాణంలో తిన్నప్పడు మాత్రమే ఇబ్బందిని కలిగిస్తాయనే విషయం మర్చిపోతారు. ఒకేసారి ఎక్కువగా తినడం వల్ల శరీర ఉష్ణోగ్రత ప్రమాదకరంగా తక్కువ స్థాయికి పడిపోతుంది. తద్వారా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. ఫలితంగా జలుబు వంటి అంటువ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

షుగర్​ పేషెంట్స్​ సీతాఫలం తినొచ్చా?-నిపుణుల మాటేంటి!

సీతాఫలం తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

క్యాన్సర్ నిరోధకంగా పనిచేస్తుంది : సీతాఫలంలో అసిటోజెనిన్, ఆల్కలాయిడ్స్ వంటి సమ్మేళనాలు ఉన్నాయి. ఈ పండ్లు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. కొన్ని పరిశోధనల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

ఐరన్ పుష్కలం : దీనిలో ఐరన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. దీంతో వైద్యులు రక్తహీనతతో బాధపడుతున్న రోగులకు సీతాఫలాన్ని తినమని సిఫార్సు చేస్తారు. ఇది అలసటను దూరం చేస్తుంది.

మెదడుకు మేలు : సీతాఫలంలో విటమిన్ బి కాంప్లెక్స్ ఉంటుంది. ఇది మెదడులోని ఒత్తిడి స్థాయిలను నియంత్రిస్తుంది. పార్కిన్సన్స్, క్షీణించిన మెదడు రుగ్మత నుంచి కూడా ఈ పండ్లు రక్షిస్తాయి.

జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది : ఈ పండులోని పీచు పదార్థం శరీరంలోని టాక్సిన్స్‌ను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది. అసిడిటీ, పొట్టలో పుండ్లు వంటి కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది.

బరువు పెరుగుతారు : దీనిలో కేలరీలు పుష్కలంగా ఉన్నాయి. బరువు పెరగాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. అలాగే జీవక్రియ రేటును పెంచడంతో పాటు ఆకలిని పెంచుతుంది.

యవ్వనంగా ఉంటారు : ఈ పండును రెగ్యులర్​గా తింటే కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరంగా ఉంచుతుంది.

ముక్కు దిబ్బడతో ఇబ్బంది పడుతున్నారా? ఈ చిట్కాలు పాటించండి!

అల్లంతో క్యాన్సర్​కు విరుగుడు! రోజూ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.