తెలంగాణ

telangana

రైతుల ఇంట... వేడుకగా "పొలాల అమావాస్య"

By

Published : Aug 30, 2019, 10:09 PM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో పొలాల అమవాస్య వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అమ్మ వారికి ప్రత్యేక పూజలతో సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నోముకున్నారు.

వరంగల్​లో ఘనంగా పొలాల అమవాస్య

వరంగల్​లో ఘనంగా పొలాల అమవాస్య

పొలాల అమావాస్య వేడుకలను వరంగల్ వాసులు ఘనంగా జరుపుకున్నారు. ఆరేపల్లిలోని గురుధామంలో శివ నందగురు కల్చరల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు ఆశాజనకంగా ఉండాలని కోరుతూ గోమాతను పూజించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వచ్చే అమావాస్యని పొలాల అమావాస్య అని పిలుస్తారని.. ఈ రోజున సంతానం లేని వారు అమ్మవారిని కొలిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పురోహితులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details