తెలంగాణ

telangana

కేంద్ర పథకాల అమలు తీరుపై ప్రత్యేక బృందం ఆరా

By

Published : Sep 25, 2021, 3:32 PM IST

national rural livelihood mission

కేంద్ర ప్రభుత్వ పథకాల(Central government schemes) అమలు తీరుపై అధికారుల బృందం వరంగల్​ జిల్లా వర్దన్నపేట(wardhannapet) మండలంలో పర్యటించింది. కట్రియాల, దమ్మన్నపేట గ్రామాలను బృంద సభ్యులు సందర్శించారు. కేంద్రం అందిస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై ఆరా తీశారు.

జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్​(National Rural Livelihoods Mission (NRLM))లో భాగంగా పథకాల అమలు తీరుపై కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందం వరంగల్ జిల్లాలో పర్యటించింది. వర్దన్నపేట(wardhannapet) మండలంలోని కట్రియాల, దమ్మన్నపేట గ్రామాలను సందర్శించింది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల పురోగతిపై బృంద సభ్యులు.. స్థానిక ప్రజాప్రతినిధులను ఆరాతీశారు. వారితో మాట్లాడి వివరాలు నమోదు చేసుకున్నారు.

అదే విధంగా రహదారుల వెంబడి నాటిన ఎవెన్యూ ప్లాంటేషన్, పనులను అధికారులు పరిశీలించారు. పంచాయతీల్లో ఉపాధి హామీ కూలీలతో పథకాల అమలు తీరు, మహిళా సంఘాలకు అందుతున్న రుణాలపై స్థానిక మహిళలతో మాట్లాడి తెలుసుకున్నారు. వివరాలు నమోదు చేసుకున్న బృంద సభ్యులు.. కేంద్రానికి నివేదించనున్నట్లు వెల్లడించారు. బృందంలో కేంద్ర ప్రభుత్వ అధికారులు జయన్, రాంశద్, అడిషనల్ పీడీ వసుమతి పాల్గొన్నారు.

ఇదీ చదవండి:Jaggareddy: రేవంత్​పై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలేంటి? కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్​కి కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details