తెలంగాణ

telangana

మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి - రెవెన్యూ గ్రామంగా అక్కంపేట

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 11:37 AM IST

Akkampet Revenue Village : హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట కొన్నేళ్లుగా సమీప గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామంలో కొనసాగింది. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలంటూ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలిరోజే అక్కంపేటను రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు. దీని పట్ల గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

CM Revanth Reddy to Adopt Akkampet Village
CM Revanth Reddy Announcement Akkampet Revenue Village

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి - రెవెన్యూ గ్రామంగా అక్కంపేట

Akkampet Revenue Village : ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఊరిని రెవెన్యూ గ్రామంగా ప్రభుత్వం మార్చడం పట్ల గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ ఊరిని రెవెన్యూ గ్రామంగా చేయకపోవడంతో 50 ఏళ్లుగా ఇబ్బందులు ఎదుర్కొన్నామని స్థానికులు చెబుతున్నారు. ఏళ్ల నాటి కలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సాకారం చేశారంటూ సంతోష పడుతున్నారు.

ఆర్థిక శాఖపై మంత్రి భట్టి విక్రమార్క సమీక్ష - 'అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తే లక్ష్యాలు సాధిస్తాం'

CM Revanth Reddy to Adopt Akkampet Village: హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేట కొన్నేళ్లుగా సమీప గ్రామం పెద్దాపూర్ రెవెన్యూ గ్రామంలో కొనసాగింది. పెద్దాపూర్‌ నుంచి అక్కంపేటను గ్రామ పంచాయతీగా ఏర్పర్చి కొన్ని సంవత్సరాలు గడిచినా రెవెన్యూగా మాత్రం పెద్దాపూర్‌లోనే కొనసాగింది. దీని వల్ల భూముల విషయమైనా, విద్యార్థుల ధ్రువపత్రాల విషయంలోనైనా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్​బాబు

'' గత సంవత్సర క్రితం రచ్చబండ కార్యక్రమానికి అక్కంపేటకు వచ్చిన రేవంత్ రెడ్డితో మా గ్రామ సమస్యలు తెలిపాం. మా గ్రామాన్ని రెవెన్యూగా చెయ్యాలని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా సమస్య పట్టించుకోవట్లేదని ఆయనతో చెప్పాం. మా సమస్యను పరిష్కరించాలంటూ రెేవంత్ రెడ్డిని కోరడం జరిగింది. సానుకూలంగా స్పందించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెవెన్యూ గ్రామంగా చేస్తాననిహామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలిరోజే రెవెన్యూ గ్రామంగా ప్రకటించారు. దీనికి మేము సంతోషిస్తున్నాం. ముఖ్యమంత్రి మా గ్రామాన్ని దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం." - గ్రామస్థులు

CM Revanth Reddy Order Akkampet As Revenue Village :కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గత సంవత్సరం రచ్చబండ కార్యక్రమాన్ని తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట నుంచి ప్రారంభించారు. రచ్చబండ కార్యక్రమంలో గ్రామస్థులు తమ గ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా చేయాలంటూ రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. గ్రామంలోని పోచమ్మ తల్లి గుడి వద్ద రచ్చ బండకు శ్రీకారం చుట్టిన రేవంత్‌ రెడ్డి తమ గ్రామంలోని సమస్యలు విని ఆవేదన చెందారని గ్రామస్థులు చెప్పారు. ఎంతో మంది ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగిన పరిష్కారం కాని సమస్యను రేవంత్‌ రెడ్డి పరిష్కరించారంటూ గ్రామస్థులు తెలిపారు. అక్కంపేటను ముఖ్యమంత్రి దత్తత తీసుకుని మరింత అభివృద్ధి చేస్తారని గ్రామస్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన కాంగ్రెస్​ను మరవద్దు : జగ్గారెడ్డి

బాక్సర్ నిఖత్ జరీన్‌కు రూ.2 కోట్ల చెక్‌ను అందించిన రేవంత్‌రెడ్డి

ABOUT THE AUTHOR

...view details