ఐటీ రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతాం : మంత్రి శ్రీధర్​బాబు

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 9:04 AM IST

thumbnail

IT Minister Sridhar Babu Interview : పారిశ్రామిక, ఐటీ రంగాల్లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని, రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు వీలైనంత ఎక్కువ కల్పించడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటామని పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్​బాబు తెలిపారు. తెలంగాణలో అణిముత్యాలాంటి పరిశ్రమలున్నాయని పేర్కొన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రకటించిన ఐటీఐఆర్ విషయంలో ముఖ్యమంత్రి, కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. 

ఫార్మాసిటీ విషయంలో ప్రజల ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని ఓ నిర్ణయానికి వస్తామని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. అలాగే ఐటీ రంగంలో హైదరాబాద్​కు ప్రత్యేకతో పాటు ఇంకా గొప్పతనాన్ని తెచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. అధికారపార్టీతో పాటు, ఎంఐఎం, ప్రతిపక్ష, మిత్రపక్షల సహకారం కోరి సజావుగా అసెంబ్లీ సెషన్​ని నడిపే ప్రయత్నం చేస్తామని తెలిపారు. అన్ని అంశాలపై శాసనసభలో మంచి ఫలవంతమైన చర్చ జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీధర్​బాబు స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష నిర్వహించి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి వైపు తీసుకువెళ్లాలో చర్చిస్తామంటున్న ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.