తెలంగాణ

telangana

రామన్​పాడు జలాశయానికి భారీ వరద...10గేట్లు ఎత్తివేత

By

Published : Sep 27, 2020, 4:47 AM IST

భారీ వర్షాలకు వనపర్తి జిల్లాలోని జలాశయాన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. భారీగా వరద నీరు పోటెత్తడం వల్ల రామన్​పాడు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. జలాశయం 10గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

ramanpad dam gates opened in wanaparthy district
రామన్​పాడు జలాశయానికి భారీ వరద...10గేట్లు ఎత్తివేత

వనపర్తి జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు జిల్లాలోని జలాశయాలన్నీ నిండి అలుగులు పారుతున్నాయి. సరళసాగర్, కోయిల్ సాగర్ సహా అనుబంధ వాగుల నుంచి వరద పోటెత్తడం వల్ల రామన్ పాడు జలాశయం నుంచి కూడా 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయినా వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతుండటం వల్ల మిగిలిన 9 గేట్లు ఎత్తేందుకు సిబ్బంది ప్రయత్నించారు. కానీ మోటార్లకు విద్యుత్ సరఫరా అందకపోవడం వల్ల 9 గేట్ల మీది నుంచి నీరు ఎక్కి పారుతోంది. ప్రాజెక్టు గేట్లు ఎత్తేందుకు ప్రస్తుతం సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వరద ఉద్ధృతి క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో గేట్లు తెరచుకోకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details