తెలంగాణ

telangana

జిల్లాకొక టాస్క్ ఫోర్స్ బృందం: నిరంజన్ రెడ్డి

By

Published : May 13, 2021, 7:26 PM IST

కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టాస్క్​ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

కరోనాపై సమీక్ష నిర్వహించిన నిరంజన్​ రెడ్డి
కరోనాపై సమీక్ష నిర్వహించిన నిరంజన్​ రెడ్డి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతి జిల్లాకు ఒక టాస్క్​ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జిల్లాల ఇంఛార్జి మంత్రుల పర్యవేక్షణలో జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్, డ్రగ్ ఇన్​స్పెక్టర్​తో ఏర్పాటైన టాస్క్​ఫోర్స్ కొవిడ్​ నియంత్రణకు పని చేస్తుందన్నారు.

ఈ బృందాలు స్థానిక పరిస్థితులను సమీక్షించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాయని పేర్కొన్నారు. ఈ విపత్కర పరిస్థితుల నుంచి ప్రజలను కాపాడుకోవడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ బృందం పనిచేస్తుందని తెలిపారు. మనోధైర్యానికి మించిన మందు లేదన్నారు. మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నది వ్యాధి తీవ్రతతో కాదని ఆందోళనతోనే జరుగుతున్నాయని చెప్పారు.

కరోనా నియంత్రణలో వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది, పోలీసుల పాత్ర ప్రముఖమైనదని తెలిపారు. వ్యాధి లక్షణాలన్న వారిని ఐసొలేషన్​లో ఉంచితే ఏలాంటి ఇబ్బంది ఉండదని.. అందుకే ఇంటింటి సర్వే చేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి:కంటతడి పెట్టిస్తున్న గర్భిణీ వైద్యురాలి 'చివరి సందేశం'

ABOUT THE AUTHOR

...view details