తెలంగాణ

telangana

సాగులో సంచలనం డ్రోన్ స్ప్రేయర్​లు

By

Published : Oct 28, 2019, 6:06 PM IST

Updated : Oct 28, 2019, 7:01 PM IST

వ్యవసాయంలో సాంకేతికత నానాటికీ పెరుగుతోంది. కూలీల కొరతను అధిగమించడంతో దిగుబడి ఖర్చులు తగ్గించుకుని, అధిక దిగుబడి సాధించేందుకు తోడ్పడే సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అందిపుచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఎన్నో యంత్రాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి. కొత్తగా అగ్రికల్చర్‌ డ్రోన్‌ స్ప్రేయర్​ రైతులను ఆకర్షిస్తున్నది.

సాగులో సంచలనం డ్రోన్ స్ప్రేయర్​లు

పంటలకు అవసరమైన ఎరువులు, క్రిమిసంహారకాలను చల్లేందుకు డ్రోన్‌ స్ప్రేయర్​లు అందుబాటులోకి వచ్చాయి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల గ్రామ రైతు వెంకట్ రెడ్డి తనకున్న పొలంలో డ్రోన్ సహాయంతో మందు పిచికారి చేశాడు. చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులు మందు పిచికారి ఏ విధంగా చేస్తున్నారని ఆసక్తిగా తిలకించారు. ఎకరాకు 500 రూపాయలు వరకు డ్రోన్ యజమానికి చెల్లించి పిచికారి చేయిస్తున్నారు. డ్రోన్ ద్వారా మందు పిచికారి చేస్తే పొలం అంతటికి పిచికారి అవుతుందని డ్రోన్ యజమానులు వెల్లడించారు.

సాగులో సంచలనం డ్రోన్ స్ప్రేయర్​లు
Last Updated : Oct 28, 2019, 7:01 PM IST

ABOUT THE AUTHOR

...view details