తెలంగాణ

telangana

'మూసీ ప్రాజెక్టులో 45 అడుగులు వరకు నీరు నింపాలి'

By

Published : Oct 25, 2019, 8:50 PM IST

మూసీ ప్రాజెక్టులో 45 అడుగుల వరకు నీరు నింపాలని ప్రాజెక్టు ఆయకట్టు రైతులు సూర్యాపేట జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు.  35 ఫీట్ల వరకే మూసీ నీటిమట్టాన్ని పరిమితం చేస్తే ఆయకట్టుకు నీరు అందదని ఆందోళన వ్యక్తం చేశారు.

సూర్యాపేటలో మూసీ ప్రాజెక్టు

సూర్యాపేటలో మూసీ ప్రాజెక్టు

నిండుకుండలా మారిన మూసీ ప్రాజెక్టు 5వ గేటు కొట్టుకుపోవడం వల్ల నీరంతా దిగువప్రాంతానికి వెళ్లింది. 5వ నంబర్​ గేటు ఇటీవల విరిగిపోగా.. అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. దీనివల్ల ఎగువ ప్రాంతం నుంచి వచ్చే నీటిని ప్రాజెక్టులో నిల్వచేసే పరిస్థితి లేదు. మిగిలిన గేట్లు కూడా బలహీనంగానే ఉండటం వల్ల ప్రాజెక్టులో 35 అడుగుల మేరకే నీటినిల్వను పరిమితం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. తమకు నీరు అందే అవకాశం లేదని ఆయకట్టు రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రాజెక్టులో 45 అడుగుల వరకు నీరు నిల్వ చేయాలని సూర్యాపేట జిల్లా కలెక్టరేట్​ వద్ద ధర్నాకు దిగారు. ఖాళీ అయిన మూసీ ప్రాజెక్టును ఎస్సారెస్పీ, ఏఎమ్మార్పీ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ప్రాజెక్టు డీఈకి వినతి పత్రం అందజేశారు.

Intro:Slug :. TG_NLG_22_25_MOOSI_FARMERS_DHARNA_AB_TS10066_HD

రిపోర్టింగ్ & కెమెరా : బి. మారయ్య , ఈటీవీ, సూర్యాపేట.

( ) గేటు కొట్టుకుపోయి కాళీ అయిన మూసి ప్రాజెక్టులో 45 ఫీట్ల వరకు నింపాలని ఆయకట్టు రైతులు సూర్యాపేట కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. 35 ఫీట్ల వరకే మూసీ నీటిమట్టాన్ని పరిమితం చేస్తే ఆయకట్టుకు నీరు అందదని ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ అయిన మూసీ ప్రాజెక్టు ను ఎస్సారెస్పీ , ఏఎమ్మార్పీ ద్వారా నింపాలని డిమాండ్ చేశారు.

వాయిస్ ఓవర్ :


నిండుకుండాలా మారిన మూసి ప్రాజెక్టు ను 5వ నంబర్ క్రస్టు గేటు ప్రాజెక్టును ఖాళీ చెందింది. మూసి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 645 అడుగులకు గాను మరమ్మతుకు గురైన గేటు కారణంగా పైగా నీరు దిగువ ప్రాంతానికి వెళ్ళింది. ఈ సంఘటనతో మూసీ ఆయకట్టు పంటలకు నీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల మరమ్మతులు చేసిన నీటి పారుదల శాఖ అధికారులు దాన్ని తాత్కాలికంగానే పనులు నిర్వహించారు. ఈ కారణంగా మూసి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన నీరు ప్రాజెక్టులో నిల్వ చేసే పరిస్థితి లేదు. ప్రాజెక్టుకు మిగిలివున్న గేట్లు కూడా బలహీనంగా ఉన్నాయని డ్యాం భద్రత కమిటీ నిపుణులు నీటి పారుదల శాఖ అధికారులకు సూచించింది. ఈ మేరకు అధికారులు ప్రాజెక్టులో 35 అడుగుల మేరకు నీటి నిల్వను మాత్రమే పరిమితం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే మూసీ ఆయకట్టు రబీ పంటకు నీరు అందే అవకాశం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో కదిలిన ఆయకట్టు రైతులు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా జరిపారు. ఈ సందర్బంగా ప్రాజెక్టు డీఈ కి వినతి పత్రం సమర్పించారు...బైట్
1. మల్లు నాగార్జున్ రెడ్డి , తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి.


Body:...


Conclusion:...

ABOUT THE AUTHOR

...view details