తెలంగాణ

telangana

గోదావరి జలాలతో పురిటి గడ్డ పునీతమైంది: హరీశ్ రావు

By

Published : Apr 24, 2020, 12:11 PM IST

Updated : Apr 24, 2020, 3:11 PM IST

సిద్దిపేట జిల్లా రైతుల కన్నీళ్లు తుడిచేందుకు చేపట్టిన రంగనాయక సాగర్ ప్రాజెక్టు వెట్ రన్​కు సిద్ధమవ్వడం సంతోషంగా ఉందని మంత్రి హరీశ్​ రావు పేర్కొన్నారు. భూసేకరణ సహా ఏ విషయంలోనూ ఒక్క కేసు కూడా లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తయ్యిందని తెలిపారు. భూములిచ్చి త్యాగాలు చేసిన రైతులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని... వారి త్యాగాలు మరువలేనివని ట్వీట్ చేశారు.

harish rao
harish rao

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం మాదిరిగానే ఈ జల సాధన ఉద్యమం విజయవంతం అయిందని మంత్రి హరీశ్​ రావు తెలిపారు. కేసీఆర్ కల సాకారమైందని పేర్కొన్నారు. ఒక్క ఇల్లు కూడా ముంపునకు గురికాకుండా 3 టీఎంసీల నీటి సామర్థ్యంతో రంగనాయక సాగర్ ప్రాజెక్టు నిర్మించుకోవడం ఒక అరుదైన ఘట్టమని చెప్పారు. ఇది సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని ట్వీట్ చేశారు. రంగనాయక సాగర్ ప్రాజెక్టుతో సిద్దిపేట నియోజకవర్గంలో 71,516 ఎకరాలకు సాగునీరు అందుతుందని వివరించారు. చెరువులు, కుంటలు నిండుతాయని తెలిపారు.

రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై హరీశ్ రావు
Last Updated :Apr 24, 2020, 3:11 PM IST

ABOUT THE AUTHOR

...view details