తెలంగాణ

telangana

Harish Rao Distributed Sheeps : 'కేసీఆర్‌ పాలన.. తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగమే'

By

Published : Jun 9, 2023, 3:52 PM IST

Updated : Jun 9, 2023, 4:48 PM IST

Minister Harish Rao Distributed Cheques : కేసీఆర్‌ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. గొర్రెల పంపిణీ సహా ఇంకో 9 పథకాలకు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. నాటి కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ.. నేడు బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ అంటూ చెప్పుకొచ్చారు.

Harish Rao
Harish Rao

Harish Rao Distributed Checks In Siddipet : సీఎం కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగమని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు కొనియాడారు. కేసీఆర్‌ వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళల ఆత్మగౌరవాన్ని పెంచారని ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన 10 రకాలపథకాల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని.. లబ్ధిదారులకు వాటిని అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు.

నాడు - నేడు కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు తెలంగాణ వస్తే ఏం వచ్చిందని మాట్లాడుతున్నారు కదా.. వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులను అడిగితే వారే చెపుతారు ఏం వచ్చిందో అని మంత్రి అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలో బీడీ కార్మికులకు ఒక్క రూపాయైన పింఛన్‌ ఇచ్చారా.. ఇప్పుడు కేసీఆర్‌ వారికి ఆసరా పింఛన్‌ ఇస్తే అగచాట్లు పెడుతుంటారా అని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆనాడు కాంగ్రెస్‌ పాలనలో మొత్తం తెలంగాణలో 29 లక్షల ఫించన్లు ఉండేవని.. కానీ ఈ రోజు బీఆర్‌ఎస్‌ పాలనలో 44 లక్షల ఫించన్లు ఇస్తున్నామని గర్వంగా చెప్పారు. అప్పుడు రాష్ట్రంలో రూ.200 ఉన్న పింఛన్‌.. ఇప్పుడు రూ.2016గా అయ్యిందని హర్షించారు.

Harish Rao Comments On Congress : ఈరోజు బీడీ కార్మికులకు ఇంట్లో ముగ్గురికీ, నలుగురికీ పింఛన్లు వస్తున్నాయని.. కాంగ్రెస్‌ నాయకులు వెళ్లి వీళ్లను అడిగితే ఏం లాభపడ్డామో చెపుతారని మంత్రి హరీశ్‌రావు హితవు పలికారు. సీఎం కేసీఆర్‌ సంపదను పెంచి పేదలకు పంచారని.. ఇప్పటికీ తమ పెద్ద కుమారుడు ఎవరంటే అవ్వలు కేసీఆర్‌ అంటున్నారన్నారు. పేదలకు మంచి వైద్యాన్ని కేసీఆర్‌ అందించారని వివరించారు. ఏ ఒక్క సీఎం అయినా పేదింటి ఆడపిల్ల పెళ్లికి ఒక్క రూపాయి అయినా సాయం చేశారని ప్రశ్నించారు. కాని నేడు తెలంగాణలో 12.71 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్లు చేయించారని స్పష్టం చేశారు.

సిద్దిపేటలో ఏఏ పథకాలకు చెక్కులు పంపిణీ :

  • బీసీ ఉపకులాలకు అనగా చేతి వృత్తి పని చేసుకునే 60 మందికి రూ.1 లక్ష చెక్కులు అందించారు.
  • వీధి వ్యాపారులకు 27 మంది లబ్ధిదారులకు రూ.30 వేల నుంచి రూ.50 వేలు చెక్కు ఇచ్చారు.
  • పిల్లలు విదేశాల్లో చదువుకుంటే వారికి సహాయం చేసేందుకు రూ. 20లక్షలు అంబేడ్కర్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ కూడా ఇద్దరికి చెక్‌లు అందించారు.
  • అదేవిధంగా ఎనిమిది మందికి లెబర్‌ డిపార్టుమెంట్‌ నుంచి మ్యారేజ్‌, డెలివరీ, యాక్సిడెంట్‌ బెనిఫిట్‌ కింద ఒక్కొక్కరికీ రూ.30వేలు నుంచి రూ.1లక్ష చెక్‌లు ఇవ్వడం జరిగింది.
  • 40 మంది మహిళలు సెట్విన్‌ ద్వారా ఎవరైతే శిక్షణ పొందారో వారికి ఉచిత కుట్టు మిషన్‌లు ఇచ్చారు.
  • ఫ్యాషన్‌ డిజైనింగ్‌ శిక్షణ పొందిన వారు కానీ, కులాంతర వివాహాలు చేసుకున్న ముగ్గురికీ కల్యాణ లక్ష్మీ రూ.1లక్షనే కాకుండా ఇంకొక రూ. 1.50 లక్షలతో కలిపి మొత్తం రూ.2.50 లక్షలు చెక్కులు ఇచ్చారు.
  • పంపు షెడ్లు కోసం లక్ష రూపాయల చెక్‌ను ఐదుగురికి అందించారు.
  • రెండో దశ గొర్రెల పంపిణీ కూడా 30 మందికి గొర్రెలను పంపిణీ చేశారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 9, 2023, 4:48 PM IST

ABOUT THE AUTHOR

...view details