ETV Bharat / state

KTR Comments at Mahabubnagar Tour : 'కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ 3 గంటల కరెంట్‌, రూ.200 పింఛనే గతి'

author img

By

Published : Jun 8, 2023, 8:32 PM IST

Updated : Jun 8, 2023, 8:55 PM IST

KTR
KTR

KTR Mahabubnagar Tour Today : తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల వేళ.. ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని... కాంగ్రెస్‌ నేతలకు మంత్రి కేటీఆర్ సవాల్‌ విసిరారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి... ఒకప్పుడు పాలమూరు అంటే మైగ్రేషన్‌ అని, ఇప్పుడు ఇరిగేషన్‌ అని వ్యాఖ్యానించారు. 55 ఏళ్లు అధికారంలో ఉండి ఏమి చేయలేని కాంగ్రెస్‌ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని... ప్రజలను కోరారు. వారికి ఓటు వేస్తే శంకరగిరి మాన్యాలు పట్టించడం ఖాయమని ఎద్దేవా చేశారు

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే మళ్లీ రూ.200 పింఛను, 3 గంటల కరెంట్‌: కేటీఆర్‌

KTR Speech at Mahabubnagar Tour : మహబూబ్‌నగర్‌ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సహచర మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లారెడ్డితో కలిసి జడ్చర్లలో 560 రెండు పడక గదుల ఇళ్లను ప్రారంభించారు. 55 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీ కరెంటు, నీళ్లు ఇయ్యలేదని, ఇవాళ మళ్లీ వచ్చి నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ.... మొసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు ఏం అవసరమని... కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేస్తున్నారని ప్రశ్నించారు.

KTR fires on Congress : కాంగ్రెస్‌ వాళ్లు ఎన్ని కేసులు పెట్టినా, బీజేపీ కృష్ణా జలాలు పంచకపోయినా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలను తీసుకువచ్చి... ఈ ఆగష్టు వరకు కర్వేన జలాశయం నింపుతామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగ అయిన ఈ కాంగ్రెస్‌ అధ్యక్షుడికి... పొరపాటున ఓటు వేస్తే మళ్లీ రూ.200 పింఛను, 3 గంటల కరెంట్‌ వస్తదన్నారు. కాంగ్రెస్ వారిని నమ్ముకుంటే మళ్లీ శంకరగిరి మాన్యాలే దిక్కని కేటీఆర్ ఎద్దేవా చేశారు. పాదయాత్రలు చేసుకుంటూ వాళ్లు ఎన్ని తిట్లు తిట్టినా ఈసారి 90వేల ఓట్లతో గెలిపించి సన్యాసులకు సమాధానం చెప్పాలని కోరారు.

'55 ఏళ్లు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించింది కాంగ్రెస్‌ పార్టీ కాదా ? ఇప్పుడు పాదయాత్రలు ఎందుకు చేస్తున్నారు ? వాళ్ల పాలనలో కరెంట్‌ సక్రమంగా వచ్చేది కాదు. గతంలో అధికారంలో ఉన్నవాళ్లు ఏపని చేయలేదు. మహబూబ్‌నగర్‌ పట్టణంలో 14 రోజులకు ఒకసారి తాగునీరు వచ్చేవి. ఆనాడు ఒక్కడు చెరువులను, తాగునీళ్ల సమస్యను పట్టించుకోలేదు. పరిశ్రమలు తీసుకురావాలనే ఆలోచన చేయలేదు.పెన్షన్‌లను ఇచ్చిన పరిస్థితి లేదు.'-కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

కాంగ్రెస్ వస్తే ఆ రెండు ఉండవు : కాంగ్రెస్‌ హయాంలో రాష్ట్రం మొత్తంలో 29 లక్షల మందికి రెండు వందల పెన్షన్‌... ఏడాదికి రూ.8వందల కోట్లు ఇస్తే, తెలంగాణ వచ్చాక 46లక్షల మందికి రెండు వేల పెన్షన్‌తో తమ ప్రభుత్వం రూ.12వేల కోట్లు ఖర్చు చేస్తోందని కేటీఆర్ అన్నారు. అవాస్తమైతే జడ్చర్ల, మహబూబ్‌నగర్‌లో ఎక్కడైనా మంత్రి, ఎమ్మెల్యేతో చర్చకు రండి అని మంత్రి సవాల్‌ విసిరారు. మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు, రైతు బీమాకు కు రాంరాం.. అంటారన్నారు. పోడు భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపి ఈ దశాబ్ది ఉత్సవాలలో పట్టాలు అందించబోతున్నామన్నారు. గిరిజనుల రిజర్వేషన్‌ను 6 నుంచి 10 శాతానికి పెంచామన్న కేటీఆర్... కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.

పాలమూరు జిల్లాకు వలసలు వాపసు వస్తున్నాయి : కాంగ్రెస్‌, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో... తెలంగాణ తరహా పాలన ఎక్కడా లేదని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సూచించారు. సీఎం కేసీఆర్ పాలనలో పాలమూరు జిల్లాకు వలసలు వాపసు వస్తున్నాయని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. 14 నియోజకవర్గాలలో... బీఆర్​ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామని వ్యాఖ్యానించారు.

ఇవీ చదవండి :

Last Updated :Jun 8, 2023, 8:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.