తెలంగాణ

telangana

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

By

Published : Oct 24, 2019, 11:41 PM IST

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మూడో రోజు జరిగిన 'గాంధీ సంకల్ప యాత్ర'లో  కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా పాల్గొన్నారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మూడో రోజు 'గాంధీ సంకల్ప యాత్ర'లో కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రుపాలా, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందనరావు పాల్గొన్నారు. స్థానిక గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి పాదయాత్రగా వెళుతూ, పరిసరాల్లోని చెత్తను తొలగించారు. అనంతరం స్థానిక ఎస్​వీవీ డిగ్రీ కళాశాల విద్యార్థులతో స్వచ్ఛ భారత్, పరిసరాల పరిశుభ్రత గురించి ముచ్చటించారు. దుబ్బాక ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని మొక్కలను నాటారు. చేనేత సహకార సంఘం వద్దకు చేరుకొని వారు తయారుచేసిన బట్టలను పరిశీలించారు. వారు బహుకరించిన చేనేత రుమాలును చూసి మంత్రి ప్రశంసించారు. ఆర్టీసీ కార్మికులు ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో పాల్గొని వారు ఇచ్చిన వినతి పత్రాన్ని స్వీకరించారు. చేనేత కార్మికుల సమస్యలను తప్పకుండా కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని అన్నారు.

గాంధీ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్రమంత్రి రుపాలా

ABOUT THE AUTHOR

...view details