తెలంగాణ

telangana

వెలుగులు పంచుతున్న.. సింగూర్​ జల విద్యుత్‌ కేంద్రం

By

Published : Nov 2, 2022, 12:33 PM IST

Singur Hydro Power Station: సింగూర్ ప్రాజెక్టు తాగు, సాగునీటికి భరోసా కల్పించడంతో పాటు.. వెలుగులు పంచుతోంది. నిరంతర విద్యుత్‌ ఉత్పత్తితో సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా జలాశయానికి జులై నుంచి వరద కొనసాగడంతో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైన నాటి నుంచి ఎప్పుడూ లేనివిధంగా గరిష్ఠ ఉత్పత్తిని సాధించారు.

Singur Hydro power Station
Singur Hydro power Station

వెలుగులు పంచుతున్న.. సింగూర్​ జల విద్యుత్‌ కేంద్రం

Singur Hydro power Station: మెతుకు సీమ జీవరేఖ మంజీరా నది.. ఈ నదిపై ఉన్న సింగూర్ జల విద్యుత్ కేంద్రం వెలుగు రేఖగా మారింది. సింగూర్ ప్రాజెక్టుకు అనుబంధంగా 15 మెగావాట్ల ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు. 7.5 మెగావాట్ల సామర్థ్యంతో రెండు యూనిట్లు ఉన్న ఈ కేంద్రంలో 1999నుంచి ఉత్పత్తి ప్రారంభమైంది.

2000సంవత్సరం నుంచి రెండు యూనిట్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రంలో ఈ యేడు రికార్డుస్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది. ఈ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రం లక్ష్యం కోటి యూనిట్లు కాగా.. ఇప్పటికే 2కోట్ల 60లక్షలకు పైగా ఉత్పత్తి జరిగింది. 80రోజుల్లోనే ఇది సాధ్యమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా జూలై 22 నుంచే కరెంట్‌ ఉత్పత్తిని ప్రారంభించి.. నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు.

ఈ కేంద్రంలో 2010-11లో అత్యధికంగా 2కోట్ల 56లక్షల 87వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. ఈసారి ఆ రికార్డును అక్టోబర్ 30 మధ్నాహ్నం అధిగమించారు. సింగూర్ జలాశయంలోకి జులై నుంచి నేటి వరకు వరద కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారానే నీటిని దిగువకు వదిలేందుకు నీటిపారుదల శాఖ అధికారులు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.

వారంలో మరో 40లక్షల యూనిట్ల ఉత్పత్తి చేసి.. 3కోట్ల యూనిట్ల మైలురాయి దాటుతామని అధికారులు విశ్వాసంతో ఉన్నారు. జలాశయంలో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి పడిపోవడం వంటి కారణాలతో 2015-16, 2019-20 సంవత్సరాల్లో ఒక్క యూనిటి విద్యుత్ కూడా ఉత్పత్తి జరగలేదు. ఈ సంవత్సరం మాత్రం మూడున్నర కోట్ల యూనిట్ల వరకు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details