తెలంగాణ

telangana

Harish Rao On Jobs: 'మేం భర్తీ చేస్తున్నాం... మీరెప్పుడు భర్తీ చేస్తారు?'

By

Published : Apr 18, 2022, 1:56 PM IST

Harish Rao On Jobs: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా ఆరోగ్య శిబిరంతో పాటు, ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు నిర్వహిస్తున్న శిక్షణా తరగతులను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు.

Harish Rao
Harish Rao

'మేం భర్తీ చేస్తున్నాం... మీరెప్పుడు భర్తీ చేస్తారు?'

Harish Rao On Jobs: రాష్ట్రంలో తాము అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నామని.. కేంద్రంలో 15 లక్షలకుపైగా ఉన్న ఉద్యోగాలను ఎప్పుడు భర్తీ చేస్తారో బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని మంత్రి హరీశ్‌ రావు ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా పోలీస్ శాఖ సహకారంతో పటాన్‌చెరులో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను, ప్రాంతీయ ప్రభుత్వ ఆసుపత్రిలో మెగా ఆరోగ్య మేళాను ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

వారంలో పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. అభ్యర్థులంతా సిద్ధంగా ఉండాలని ఆయన తెలిపారు. ధరలు పెంచి, ఉద్యోగాలు ఇవ్వకుండా, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా అని బండి సంజయ్‌ను మంత్రి ప్రశ్నించారు. ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భాజపా లబ్ధి పొందాలని చూస్తోందన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ భాజపాను నిలదీయాలన్నారు.

ఇదే విషయంపై ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించాలని హరీశ్ రావు సూచించారు. విద్యార్థుల కోరిక మేరకు సీఎం కేసీఆర్... మూడేళ్ల వయోపరిమితి మినహాయింపు ఇచ్చారన్నారు.95 శాతం ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా చేశారని... పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 30 శాతం అవకాశం కల్పించడం దేశంలో ఎక్కడా లేదన్నారు.

మేము అన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నాం..కేంద్రంలో 15 లక్షల పైగా పోస్టులు ఎప్పుడు భర్తీ చేస్తారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. ధరలు పెంచినందుకు, ఉద్యోగాలు ఇవ్వనందుకు, ప్రజల జీవితాలను ఆగం చేస్తున్నందుకు యాత్ర చేస్తున్నారా? ఏం ముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. కుల, మతాల మధ్య చిచ్చు పెట్టి భాజపా లబ్ధి పొందాలని చూస్తున్నది. తెలంగాణ విద్యార్థులు ఉద్యోగాల భర్తీ గురించి ఎక్కడికక్కడ నిలదీయండి. ట్విటర్ వేదికగా మోదీ, బండి సంజయ్, కిషన్ రెడ్డిలను ప్రశ్నించండి.

-- హరీశ్‌రావు, మంత్రి


ఇదీ చదవండి:ఐటీఐ కళాశాలలో వేధిస్తోన్న అధ్యాపకుల కొరత.. విద్యార్థుల్లో ఆందోళన..!

ABOUT THE AUTHOR

...view details