తెలంగాణ

telangana

తెరాస గెలుపుతో కార్యకర్తల సంబురాలు

By

Published : Mar 20, 2021, 8:17 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడంతో సంగారెడ్డి జిల్లాలో తెరాస కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. జహీరాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా బైక్​ ర్యాలీ నిర్వహించారు.

Activists cheer with trs victory in mlc elections
తెరాస గెలుపుతో కార్యకర్తల సంబురాలు

తెరాస ప్రభుత్వ పనితీరుపై పట్టభద్రులు నిజమైన తీర్పు వెలువరించారని ఆ పార్టీ నాయకులు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడంతో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లో నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు.

జహీరాబాద్​లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ప్రధాన రహదారి మీదుగా తెరాస కార్యకర్తలు బైక్​ ర్యాలీ నిర్వహించారు. భవాని మందిర్ కూడలి వద్ద బాణాసంచా కాలుస్తూ.. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. పరస్పరం మిఠాయిలు పంచుకొని సంబరాల్లో మునిగిపోయారు. తమ పార్టీ అభ్యర్థులను గెలిపించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి:హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్​ స్థానంలో వాణీదేవికి పట్టం

ABOUT THE AUTHOR

...view details