తెలంగాణ

telangana

'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

By

Published : Feb 21, 2021, 12:01 PM IST

'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు భాషావేత్తలు హాజరయ్యారు.

అన్ని రాష్ట్రాల్లో పరిపాలన, ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలో కొనసాగించాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు సైతం మాతృభాషలో వెలువడితేనే ప్రజలకు సౌలభ్యమైన సేవలు అందించినట్లవుతుందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని స్వర్ణభారత్‌ ట్రస్టులో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతితో పాటు హోంమంత్రి మహమూద్ అలీ, పలువురు భాషావేత్తలు హాజరయ్యారు. సంస్కృతికి జీవనాడి లాంటి మాతృభాషే... ఉన్నతమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుందని వెంకయ్య చెప్పారు. అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన తెలిపారు.

మాతృభాషలో మాట్లాడటాన్ని గర్వంగా భావించాలి. ప్రాథమిక విద్య, పరిపాలనలో మాతృభాషకు ప్రాధాన్యం ఇవ్వాలి. కోర్టుల్లో వాదనలు, తీర్పులు మాతృభాషలో ఉంటే ప్రజలకు మేలు. అమ్మభాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.

--- ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

'మాతృభాషను ప్రేమిద్దాం.. మన సంస్కృతిని కాపాడదాం'

ABOUT THE AUTHOR

...view details