తెలంగాణ

telangana

ఇబ్రహీంపట్నంలో హరీశ్​ జన్మదిన వేడుకలు

By

Published : Jun 3, 2020, 6:35 PM IST

తెరాస కీలకనేత, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్​రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇబ్రంహీంపట్నం పరిధిలోని లోయపల్లిలో టీఆర్​ఎస్వీ ఆధ్వర్యంలో వలస కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు.

టీఆర్ఎ​స్పీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ జన్మదిన వేడుకలు
టీఆర్ఎ​స్పీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ జన్మదిన వేడుకలు

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని లోయపల్లిలో హరీశ్​రావు జన్మదిన వేడుకలు వైభవంగా నిర్వహించారు. టీఆర్​ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి పాలకూర్ల వెంకటేశ్ గౌడ్ (పీవీ గౌడ్) నేతృత్వంలో కేక్​ కట్ చేశారు. మంచాల మండలంలోని నాలుగు గ్రామాల్లోని పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఒడిశాకు చెందిన వలస కూలీలకు పండ్లు పంచారు. కార్యక్రమంలో తెరాస విద్యార్థి విభాగం నాయకులు నాగరాజు ముదిరాజ్, కాటం గౌడ్, లింగ నాయక్, తాళ్లపల్లి నగేష్, నారి మల్లేశ్, పాలకూర్ల నగేష్ గౌడ్ పాల్గొన్నారు.

టీఆర్ఎ​స్పీ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్ జన్మదిన వేడుకలు

ABOUT THE AUTHOR

...view details