తెలంగాణ

telangana

'శాకాహారిగా మారు.. ధ్యానంతోనే దైవాన్ని చేరు'

By

Published : Jan 26, 2021, 7:23 PM IST

జీవహింస చేయకుండా శాకాహారులుగా మారాలని గోదావరిఖనిలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యులు అవగాహన ర్యాలీ చేపట్టారు. జీవులను చంపి వాటి మాంసం తినడం ద్వారా హత్య చేసినవారితో సమానమని చెప్తూ పాటలు పాడారు. శాకాహారిగానే మనిషి దైవాన్ని చేరుతాడాని తెలిపారు.

Rally of members of the Pyramid Spiritual Society to become vegetarians
శాకాహారులుగా మారాలని పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యుల ర్యాలీ

జీవహింస చేయకుండా శాకాహారులుగా మారాలని గోదావరిఖనిలో పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ సభ్యులు ర్యాలీ చేపట్టారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ చౌరస్తా వద్దకెళ్లి ఆటపాటలతో అవగాహన కల్పించారు.

ధ్యానం చేయడం ద్వారానే సకల భోగాలు కలుగుతాయని తెలిపారు. జీవులను చంపి వాటి మాంసం తినడం వల్ల హత్య చేసినవారితో సమానమని అన్నారు. ఏ జీవినీ హింసించరాదని పాటలు పాడారు.

జాతిపిత మహాత్మా గాంధీ సత్యం, అహింస అనే ఆయుధాలను ఉపయోగించి దేశానికి స్వాతంత్య్రం సాధించారని పేర్కొన్నారు. జీవిత పరమార్థాన్ని తెలిపే ధ్యానం, శాకాహారంతోనే దైవాన్ని మనిషి చేరుతాడాని పిరమిడ్ గురువు భూపతి రాజు తెలిపారు.

ఇదీ చూడండి:రైతు ఉద్యమానికి మద్దతుగా ట్రాక్టర్ ర్యాలీ

ABOUT THE AUTHOR

...view details