తెలంగాణ

telangana

నిజామాబాద్‌లో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు.. కమ్మ సంఘం రక్తదాన శిబిరం

By

Published : Jan 18, 2023, 3:52 PM IST

NTR 27th Death Anniversary in Nizamabad: తెలంగాణలో వాడ వాడలా దిగంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా పలు చోట్ల స్వచ్ఛందంగా అన్నదానం, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ తెలుగు ప్రజలకు చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు.

NTR death anniversary
NTR death anniversary

NTR 27th Death Anniversary in Nizamabad: నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్‌ వర్ధంతిని ఆయన అభిమానులు, తెలుగుదేశం కార్యకర్తలు నిర్వహించారు. నిజామాబాద్‌ కమ్మ సంఘం ఆధ్వర్యంలో నగర శివార్లలోని సంఘం భవనంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం జిల్లా కమ్మ సంఘం నేతృత్వంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

100మందికి పైగా యువకులు, పుర ప్రముఖులు రక్తదానం చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రం నిర్వహించారు. తెలుగువారి ఖ్యాతిని ఖండాతరాలు వ్యాపింప చేసిన మహనేత ఎన్టీఆర్‌ అని కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు అభిప్రాయపడ్డారు. స్వచ్ఛమైన రాజకీయాలు, నిరుపేదలకు అభ్యున్నతికి ఎన్టీఆర్‌ చేసిన సేవలకు గుర్తుగానే కమ్మ సంఘం ఆధ్యర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్‌లో మరింత విస్తరిస్తామని సంఘం ప్రతినిధి అట్లూరి రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ అన్నారు.

నిజామాబాద్‌లో ఎన్టీఆర్‌ వర్ధంతి వేడుకలు.. కమ్మ సంఘం రక్తదాన శిబిరం

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details