తెలంగాణ

telangana

Dharmapuri Arvind fires on BRS : 'నిర్మాణాలకు డబుల్​ బిల్లింగ్​లు చూపి.. రూ.5221 కోట్లు నొక్కేశారు'

By

Published : Jul 16, 2023, 9:36 PM IST

Dharmapuri Arvind fires on MLA Prashanthreddy : బీఆర్​ఎస్ ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖలో చేసిన నిర్మాణాలకు డబుల్ బిల్లింగ్ చూపి.. రూ.5221 కోట్లకుపైగా అవినీతికి పాల్పడిందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Arvind
Arvind

"బీఆర్​ఎస్ నిలువుదోపిడి.. డబుల్ బిల్లింగ్ చూపి 5221 కోట్లు స్వాహా"

Dharmapuri Arvind fires on MLC kavitha : కల్వకుంట్ల కుటుంబం.. తెలంగాణ రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్లకు డబుల్ బిల్లింగ్ చూపించి.. రూ.ఐదు వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన అర్వింద్.. వేల్పూర్ మండలంలో కేంద్ర నిధులతో చేపట్టిన వంతెనను పరిశీలించారు.

ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖలో రూ.5221 కోట్ల అవినీతి జరిగిందని ఎంపీ దుయ్యబట్టారు. రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్​రెడ్డి.. రాష్ట్ర సొమ్మునంతా కల్వకుంట్ల కుటుంబానికి మళ్లిస్తున్నారని విమర్శించారు. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్రప్రభుత్వ నిధులను నొక్కేశారని ఆరోపించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ.318 కోట్ల స్కామ్ జరిగిందన్నారు.

జిల్లాలో 51 పనుల్లో 33 పనులు తన సొంత నియోజకవర్గం బాల్కొండలోనే చేశారని వెల్లడించారు. ఒకే పనికి రెండు రకాల నిధులు వినియోగించారని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రధాని మోదీ ఇచ్చిన నిధులను కేసీఆర్ కుటుంబానికి మళ్లిస్తున్నారని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

కేంద్రప్రభుత్వ నిధులతో నిర్మించినట్టు యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చారని.. శిలా ఫలకం మీద మాత్రం రుణం తీసుకున్న నిధులతో నిర్మించినట్టు పేర్కొంటున్నారని అన్నారు. ఒక పనిని రెండు నిధులతో ఎలా చేస్తారని.. మిగిలిన నిధులు ఎటు మళ్లించారని ప్రశ్నించారు. చేసిన పనిలోనూ ప్రశాంత్​రెడ్డి 25 శాతం కమీషన్ తీసుకున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే త్వరలో కవిత.. దిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ కాబోతున్నట్లు తెలిపారు. తెలంగాణలో ముఖం చెల్లక విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. ఆర్థిక మంత్రి హరీశ్​రావు కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులతోనే.. సిద్దిపేటలో ఔటర్​ రింగ్​రోడ్డు నిర్మించినట్లు పేర్కొన్నారు.

"కల్వకుంట్ల కుటుంబం.. తెలంగాణ రాష్ట్రాన్ని దారుణంగా దోచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్లకు డబుల్ బిల్లింగ్ చూపించి.. రూ.ఐదు వేల కోట్లకు పైగా అవినీతికి పాల్పడింది. నాలుగేళ్లలో డబుల్ బిల్లింగ్ ద్వారా మంత్రి ప్రశాంత్ రెడ్డి కేంద్రప్రభుత్వ నిధులను నొక్కేశారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే రూ.318 కోట్ల స్కామ్ జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలంటూ కేంద్ర ఆర్థిక శాఖకు ఫిర్యాదు చేశాం". - ధర్మపురి అర్వింద్, నిజామాబాద్ ఎంపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details