ETV Bharat / bharat

PM Modi on KCR family : 'కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి'

author img

By

Published : Jun 27, 2023, 3:11 PM IST

Updated : Jun 27, 2023, 6:53 PM IST

PM Modi
PM Modi

15:06 June 27

PM Modi criticizes KCR family : 'కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి'

'కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయండి'

Modi criticizes KCR in Bhopal meeting : ప్రధాని నరేంద్రమోదీ కేసీఆర్‌ కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో జరిగిన మేరీ బూత్ సబ్ సే మజ్ బూత్ అనే ప్రచార కార్యక్రమంలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో దేశవ్యాప్తంగా వారసత్వ రాజకీయాలపై విమర్శలు చేస్తూ.. బీఆర్‌ఎస్‌ పార్టీని కూడా ప్రస్తావించారు. కేసీఆర్‌ కుమార్తె బాగుండాలంటే బీఆర్‌ఎస్‌కు ఓటేయాలని... మీ కుటుంబం బాగుపడాలంటే బీజేపీకి ఓటువేయాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మిగతా విపక్షపార్టీలపై మోదీ విమర్శలు చేశారు. గాంధీ కుటుంబంలోని కుమారుడు, కుమార్తె బాగుపడాలంటే కాంగ్రెస్‌కు ఓటువేయాలని.. మూలాయసింగ్ కుమారుడు బాగుపడాలంటే సమాజ్‌వాదీ పార్టీకి ఓటువేయాలని.. లాలూ కుటుంబంలోని కుమారుడు, కుమార్తె బాగుపడాలంటే ఆర్జేడీకి ఓటువేయాలని సూచించారు. శరద్‌పవార్ కుమార్తె బాగుపడాలంటే ఎన్‌సీపీకీ ఓటు వేయాలని.. అబ్దుల్లా కుమారుడు బలపడాలంటే నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఓటువేయాని సూచించారు. కరుణానిధి కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు బాగుపడాలంటే కావాలంటే డీఎంకేకు ఓటువేయండి అంటూ ఎద్దేవా చేశారు.

PM Modi speech at Bhopal meeting : కార్యక్రమంలో సుమారు10 లక్షల మంది బూత్​ స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీకి.. బూత్ స్థాయి కార్యకర్తలే అతి పెద్ద బలమని పేర్కొన్నారు. వారే బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా చేశారని అభినందించారు.2024లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందనే.. విపక్షాలు కడుపు మంటతో ఉన్నాయని మోదీ ఎద్దేవా విమర్శించారు. అందుకోసమే ప్రతిపక్షాలు ఏకమై.. సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీయే.. కోట్ల రూపాయల అవినీతి చేసిందని.. ఆర్​జేడీ, టీఎంసీ, ఎన్​సీపీ ఇలా అన్ని పార్టీలు కుంభకోణాలతో నిండిపోయాయని ఆరోపించారు. బీజేపీ నేతలు ఏసీ గదుల్లో కూర్చొని.. ఆదేశాలు జారీ చేసేవాళ్లు కాదంటూ కాంగ్రెస్​ను ఉద్దేశించి పరోక్షంగా విరుచుకుపడ్డారు. తాము ప్రజల కోసం.. వాతావరణ పరిస్థితులను తట్టుకుని నిరంతరం శ్రమిస్తున్నామని తెలిపారు.

"చంద్రశేఖరరావు కుమార్తె బాగుపడాలంటే మీరు బీఆర్‌ఎస్‌కు ఓటువేయండి. కానీ మీ కుమారుడు, కుమార్తె, మనవడు, మనవరాలు, మీ వారసులు బాగుపడాలంటే ఓటు బీజేపీకి ఓటేయండి."- నరేంద్ర మోదీ, భారత ప్రధాని

ఇవీ చదవండి:

Last Updated :Jun 27, 2023, 6:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.