తెలంగాణ

telangana

TU Hostel Problems : ఇదేందయ్యా ఇది.. హాస్టలా..? సమస్యల అడ్డానా..?

By

Published : Jul 22, 2023, 10:22 AM IST

Telangana University Hostel Issue : విరిగిన తలుపులు, అద్దాలు పగిలిన కిటికీలు.. నీళ్లు రాని నల్లాలు. విద్యార్థులకు సరిపడా అందుబాటులో లేని మరుగుదొడ్లు. వేలాడుతున్న విద్యుత్తు తీగలు. వర్షానికి హాస్టల్‌ భవనాలపై కప్పు నుంచి కారుతున్న నీరు. ఈ సమస్యలన్నీ నిజామాబాద్ జిల్లా డిచిపల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో తాడవిస్తున్నాయి. వర్సటీలో విద్యార్థుల సమస్యలను పక్కకు నెట్టి అధికారాల కోసం పాకులాడుతున్న ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

Tu Hostel
Tu Hostel

ఇదేందయ్యా... హాస్టలా లేకా సమస్యలా అడ్డానా....?

Telangana University Hostel Problems :తెలంగాణ యూనివర్సిటీలోని విద్యార్థుల వసతి గృహాల సమస్య రోజురోజుకు తలనొప్పిగా మారుతున్నాయి. వర్సిటీలో బాలికలు, ఓల్డ్ బాయ్స్, న్యూ బాయ్స్ అంటూ మెుత్తం మూడు వసతి గృహాలున్నాయి. వీటిలో దాదాపు 1200 మందికి పై విద్యార్థులు ఉంటున్నారు. కానీ వారికి సరిపోయే వంట, పారిశుద్ధ్య సిబ్బంది లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు వస్తే వసతి గృహాల్లో నీరు చేరి నివాసానికి కూడా ఇబ్బందిగా మారుతోంది. విద్యుత్‌ సాకేట్లోలోకి నీరు చేరి విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. మరుగుదోడ్లకు జాలీలు లేక విష సర్పాలు వస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"తెలంగాణ విశ్వవిద్యాలయానికి వస్తే రిజిస్టార్ గొడవలు, వీసీ అక్రమాలు ఇవి మాత్రమే ఉంటున్నాయి. ఈ వర్సిటీ అయితే రిజిస్ట్రార్​ కోసమో, వీసీ కోసమో కాదు కదా. ఈ వర్సిటీ ఉన్నది విద్యార్థుల కోసం వారి నాణ్యత కోసం ఇది అధికారులు గమనించాలి. హాస్టల్​లో వైరింగ్ పోయింది. సాకెట్​లల్లో నీరు వస్తుంది. గమనించకుండా సాకెట్ వినియోగిస్తే.. షాక్ తగులుతోంది. ఆసుపత్రి ఉంది కానీ అందులో సరిపడా మందులు లేవు అసలే ఈ కాలంలో జబ్బులు ఎక్కువగా వస్తుంటాయి. నిన్న ఒక విద్యార్థి వెళ్తే డోలో ట్యాబ్లెట్ కూడా లేదు మినిమమ్ ఉండాల్సినవి కూడా లేకపోతే వర్సిటీ ఎందుకు..? మూసేయండి. రిజిస్ట్రార్, వీసీల కోసమే అయితే మీరే కొట్లాడండి మీరే జీతాలు తీసుకోండి మీరే ఉండండి. కోట్ల రూపాయలు పెట్టి హాస్టల్​ కట్టడం ఎందుకు.. దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేనప్పుడు."- గోపాల్‌, పీజీ విద్యార్థి

TU Girls Hostel Problems :బాలికల వసతి గృహంలో మెుత్తం 350 మంది నివాస సామర్థ్యం ఉంటే ప్రస్తుతం 600 మంది విద్యార్థినులు ఉంటున్నారు. ఒక్కో గదిలో 10 నుంచి 12 మంది సర్దుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాకాలం వచ్చిందంటే చాలు పామలు హాస్టల్​ పరిసరాల్లో తిరుగుతుంటాయి. విద్యార్థినుల హాస్టల్​ గదిల కిటీకీలకు జాలీలు లేక పాములు, బల్లులు, కిటాకాలు వస్తున్నాయి. వీరి ఇబ్బందుల గురించి పలు మార్పు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. నూతన హాస్టల్ నిర్మిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నాఫలితం సూన్యం.

"హాస్టల్​ ఫుడ్​లో పురుగులు వస్తున్నాయి. ఈ విషయం వార్డెన్​కు, కేర్​ టేకర్​కు చెప్పినా ఎలాంటి మార్పు లేదు. హాస్టల్​కి వాచ్​మెన్​ లేక కుక్కలు ​ లోపలికి వస్తున్నాయి. ప్లేట్లలో కుక్కలు మూతి పెడుతున్నాయి. వాటిని సరిగ్గా కడగకముందే వాటిలో మాకు భోజనం పెడతారు. అది మా ఆరోగ్యానికే హానికరం. ఎన్నిసార్లు చెప్పినా మా గోడు ఎవరికీ పట్టడం లేదు. దయచేసి అధికారులు స్పందించండి. " - సంతోష్, విద్యార్థి

వసతి గృహాల్లో నాణ్యమైన భోజనం అందక పోగా.. ఆహారంలో పురుగులు వస్తునాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కోసారి సరిపడ ఆహారం కూడ ఉండదని, వంటకాలపై హస్టల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడలు, వ్యాయామాలకోసం సరైన మైదానం, జిమ్‌లు లేవని వాపోతున్నారు.

"మా న్యూ బాయ్స్ హాస్టల్​లో 330 మంది విద్యార్థులుంటారు. 16మంది వర్కర్లు ఉన్నారు. హాస్టల్​ను శుభ్రంగా ఉంచడం లేదు. చాలా సార్లు తినే ఆహారంలో పురుగులు వస్తున్నాయి. ఆడుకుందాం అంటే ఏ సదుపాయాలు లేవు. పేరుకే జిమ్​ ఉంది. అందులో సరైన వసతులు లేవు." - గంగాధర్, విద్యార్థి

ఇప్పటికైనా వర్సిటీ అధ్యాపకులు అధికారాల కోసం పాకులాడటం కన్నా విద్యార్థుల సమస్యలపై దృష్టి కేంద్రికరించి త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details