ETV Bharat / state

Protests in Telangana University : టీయూలో విద్యార్థుల ధర్నా.. వీసీని రౌండప్ చేసిన అవుట్​సోర్సింగ్​ ఉద్యోగులు

author img

By

Published : Jun 14, 2023, 8:34 PM IST

tu
tu

Telangana University : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. వర్శిటీ పరిపాలన పూర్తిగా స్తంభించిపోయింది. అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేస్తున్నారు. సిబ్బంది లేక భోజన వసతులు కొరవడి విద్యార్థులు నిరసన బాట పట్టారు. వీసీ రవీందర్ ​గుప్తాను విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటూ సిబ్బంది, భోజనం ఎప్పుడు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు.

Protests in Telangana University : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత మూడు రోజులుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. పరిపాలనా భవనం ఎదుట బైఠాయించి ధర్నా చేస్తున్నారు. దీంతో వంట, పారిశుద్ద్యం, ఇతర విభాగాలపై ప్రభావం పడింది. వంట చేసే సిబ్బంది విధులకు రాకుండా ఆందోళనలో పాల్గొనడంతో రెండు రోజులుగా విద్యార్థులు ఆహారం కోసం అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో విద్యార్థులు సైతం ఆందోళన బాట పట్టారు.

అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ఆందోళనలో పాల్గొన్నారు. గత నెలలో సైతం అవుట్ సోర్సింగ్ సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే పరిస్థితి తలెత్తింది. నెల ప్రారంభమై పదిహేను రోజులవుతున్నా జీతాలు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ప్రతి నెలా ధర్నాలు చెయ్యాలా అని ఆవేదన వ్యక్తం చేశారు.

అవుట్ సోర్సింగ్ సిబ్బంది విధులకు రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఉదయం 11గంటలకు అల్పాహారం చెయ్యాల్సి వచ్చింది. సాయంత్రం 5.30గంటలకు విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేశారు. సమస్య పరిష్కరించాలంటూ వర్శిటీకి వచ్చిన వీసీ రవీందర్​గుప్తాను విద్యార్థులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అడ్డుకున్నారు. జీతాలు ఎప్పుడు ఇస్తారంటూ సిబ్బంది, భోజనం ఎప్పుడు అంటూ విద్యార్థులు ప్రశ్నించారు.

రిజిస్ట్రార్​ గుర్తింపులో అయోమయం.. జీతాల చెల్లింపు కోసం వీసీ రవీందర్ గుప్తా.. వర్శిటీలోని బ్యాంకుకు వెళ్లి అధికారిని సంప్రదించారు. వర్శిటీ పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్ మీరు గుర్తించడం లేదని.. మీరు నియమించిన రిజిస్ట్రార్​ను పాలక మండలి గుర్తించడం లేదని.. తాము బిల్లులను అనుమతించలేని పరిస్థితి వచ్చిందని బ్యాంకు అధికారి సమాధానం ఇచ్చారు. దీంతో ఏమీ చేయలేక పరీక్షల విభాగంలోకి వీసీ వెళ్లిపోయారు.

ఉద్యోగం వద్దు.. మా డబ్బులు మాకు కావాలి.. ఈ సమయంలో దక్షిణ ప్రాంగణంలో దినసరి కూలీ కింద పని చేస్తున్న కొందరు వీసీ వద్దకు వచ్చి నిలదీశారు. నియామకం కోసం రూ.30వేల నుంచి రూ.50వేల వరకు డబ్బులు తీసుకుని రెండు నెలలు అయ్యాక తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. చేసిన పనికి సైతం డబ్బులు ఇవ్వలేదని.. ఉద్యోగం వద్దూ ఏమీ వద్దని తమ డబ్బులు ఇప్పించాలంటూ వీసీ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. సమస్య పరిష్కరిస్తామంటూ వీసీ వాళ్లకు చెప్పారు. ఆ తర్వాత ఐదున్నర ప్రాంతంలో భోజనాలు రావడంతో విద్యార్థులు వెళ్లిపోగా.. నిరసన విరమించిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఇళ్లకు వెళ్లారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.