తెలంగాణ

telangana

నిఖత్‌కు రూ.20 కోట్ల విలువైన స్థలం.. త్వరలో గ్రూప్-1 ఉద్యోగం

By

Published : Feb 20, 2023, 5:36 PM IST

Boxer Nikhat Zareen: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు తెలంగాణ ప్రభుత్వం 600 గజాల స్థలాన్ని ఇచ్చింది. దీని విలువ సుమారు 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దీనితో పాటు ఆమె కోరిక మేరకు త్వరలో గ్రూప్ 1 కేడర్ కింద డీఎస్పీ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

Srinivasgoud
నిఖత్‌కు 20 కోట్ల విలువైన స్థలం.. గ్రూప్1 ఉద్యోగం!

Boxer Nikhat Zareen: ప్రపంచ మహిళా బాక్సింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ప్రపంచ బాక్సింగ్ వేదికపై భారత్‌ సత్తా ఏంటో చూపించింది. వరల్డ్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్‌ సాధించి.. తెలంగాణ, భారత్ ఖ్యాతిని చాటిచెప్పిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా ఆమెకు తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకాలు అందించింది.

Telangana Govt to provide land to Nikhat Zareen: తెలంగాణ బిడ్డ బాక్సర్ నిఖత్ జరీన్‌కు 600 గజాల స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. తెలంగాణ క్రీడా శాఖ తరఫున ఇంటి స్థలం పట్టాను రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో... నికత్ తండ్రి మహ్మద్ జమిల్ అహ్మద్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అంద జేశారు. జూబ్లీహిల్స్‌లో ఇచ్చిన 600 గజాల స్థలం 15 కోట్ల రూపాయల నుంచి 20 కోట్ల రూపాయల విలువ ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ చెప్పారు.

అలాగే నిఖత్ జరీన్ కోరిక మేరకు త్వరలో ఆమెకు గ్రూప్- 1 కేడర్ కింద డీఎస్పీ ఉద్యోగం కూడా ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. క్రీడాకారులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో నిషా సింగ్‌కు కూడా 2 కోట్ల రూపాయల నగదు, 600 గజాల స్థలం ఇచ్చినట్లు మంత్రి గుర్తు చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్‌.. సామాన్య కుటుంబం నుంచి వచ్చి... ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిందని అన్నారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందని పేర్కొన్నారు.

ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గంలో ట్రైనర్‌లను నియమిస్తున్నట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్‌లో ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసేందుకు కొత్త క్రీడా పాలసీ తీసుకొస్తున్నట్లు వివరించారు. తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలువబోతుందని మంత్రి స్పష్టం చేశారు. తమ కూతురు ప్రతిభను గుర్తించి కోట్ల రూపాయల విలువ చేసే స్థలం ఇచ్చినందుకు మహ్మద్ జమిల్ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎంతో పోత్సాహం ఇవ్వడం వల్ల తమ కుమార్తె క్రీడల్లో రాణిస్తున్నారని అన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details