తెలంగాణ

telangana

మామిడి తోటల్లో యాంత్రీకరణపై రైతులకు అవగాహన

By

Published : Nov 8, 2020, 5:50 PM IST

నిజామాబాద్​ జిల్లా సావెల్​ గ్రామంలో మామిడి చెట్ల ప్రూనింగ్​పై అవగాహన కార్యక్రమం జరిగింది. రైతులకు పూత, పిందె, కాయ దశల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త మహేందర్​ వివరించారు.

Awareness of farmers about mechanization in mango orchards in nizamabad distict
మామిడి తోటల్లో యాంత్రీకరణ గురించి రైతులకు అవగాహన

నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం సావెల్ గ్రామంలోని లింబారెడ్డి మామిడి క్షేత్రంలో మామిడి చెట్ల ప్రూనింగ్, పునరుద్ధరణపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మామిడి చెట్ల కొమ్మల కత్తిరింపులు, మామిడి తోటల్లో యాంత్రీకరణ గురించి రైతులకు అవగాహన కల్పించారు.

వ్యవసాయ శాస్త్రవేత్త మహేందర్ రైతులకు పూత, పిందె, కాయ దశల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల జిల్లాల నుంచి రైతులు పాల్గొన్నారు.

ఇవీ చూడండి:ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. రైతుల ఆందోళన..

ABOUT THE AUTHOR

...view details