తెలంగాణ

telangana

ntr birth anniversary: పార్టీలకు అతీతంగా వేడుకలు

By

Published : May 28, 2021, 3:50 PM IST

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(Nandamuri Taraka rama rao) 98వ జయంతి వేడుకలను (ntr birth anniversary) నిర్మల్​లో ఘనంగా జరిపారు. పార్టీలకు అతీతంగా నిర్మల్​ జిల్లా తెరాస నాయకులు, అభిమానులు ఆయనకు నివాళులు అర్పించారు.

98th Anniversary of NTR
ntr birth anniversary: పార్టీలకు అతీతంగా వేడుకలు

పార్టీలు వేరైనా ఆ నాయకునిపై ఉన్న గౌరవాన్ని వదులుకోలేదు. ఎన్టీఆర్(NTR)​ 98వ జయంతి సందర్భంగా పార్టీని సైతం పక్కన బెట్టి నిర్మల్ జిల్లా తెరాసా నాయకులు తమ అభిమానాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు(Nandamuri Taraka rama rao) జయంతి వేడుకలను (ntr birth anniversary) నిర్మల్​లో ఘనంగా నిర్వహించారు.

గతంలో తెలుగుదేశం పార్టీ నుంచి మున్సిపల్ ఛైర్మన్​గా పదవిని చేపట్టిన గండ్రత్ ఈశ్వర్… ప్రస్తుతం తెరాస పార్టీ నుంచి నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్​గా ఉన్నారు. అయినా కూడా పార్టీతో సంబంధం లేకుండా నందమూరి జయంతి వేడుకల్లో పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఛైర్మన్​తో పాటు పలువురు తెరాస కౌన్సిలర్లు, నాయకులు పాల్గొని ఎన్టీఆర్​ సేవలను స్మరించుకున్నారు.

ఇదీ చూడండి:TDP Mahanadu: 'ఎన్టీఆర్​కు భారతరత్న ఇప్పించటమే నిజమైన నివాళి'

ABOUT THE AUTHOR

...view details