తెలంగాణ

telangana

ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతుల రాస్తారోకో

By

Published : Jun 8, 2020, 2:53 PM IST

ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్​ చేస్తూ నిర్మల్​ జిల్లా భైంసా మండలం కమోల్ గ్రామం వద్ద రైతులు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇప్పటి వరకు తాము అమ్మిన పంటకు డబ్బులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.

farmers protest to buy grains at kamol
ధాన్యం కొనుగోలు చేయాలంటూ రైతులు రాస్తారోకో

నిర్మల్​ జిల్లా భైంసా మండలం కమోల్​ గ్రామం వద్ద రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. తాము ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయని.. వాటి కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్​ చేశారు. వరి ధాన్యాన్ని దగ్ధం చేసి నిరసన తెలిపారు.

పండించిన పంట చిన్నపాటి వర్షాలకే తడిసిపోయి.. తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు తెలిపారు. రైతుల వద్ద క్వింటాకు 3 నుంచి 5 కిలోల వరకు కోత విధించడం సరికాదని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details