తెలంగాణ

telangana

రైతులను ఆదుకోవాలని తెదేపా ఆధ్వర్యంలో రాస్తారోకో

By

Published : Oct 23, 2020, 4:46 PM IST

నారాయణపేట జిల్లా మక్తల్​ అంబేద్కర్​ చౌరస్తాలో తెదేపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

tdp protest in narayanpet district
రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే ధర్నా

అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం కింద ప్రభుత్వం రూ. 20వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి. నారాయణపేట జిల్లా మక్తల్​ అంబేద్కర్​ చౌరస్తాలో తెదేపా కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులను, సామాన్యులను ఆదుకోవాలని దయాకర్​ రెడ్డి కోరారు.

ఇళ్లు కూలిపోయిన వారికి ఆర్థిక సాయం, గొల్ల కురుమలకు పరిహారం అందించాలని సర్కారుకు సూచించారు. అనంతరం ఎంపీడీవో రాజేందర్ గౌడ్, ఏడీఏ దైవ గ్లోరికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు మధుసూదన్ రెడ్డి, వడ్వాట్ రవి, లక్ష్మి నారాయణ, అనిల్ గౌడ్, మౌలాలి, విష్ణు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'కరోనా వల్ల తీవ్ర పేదరికంలోకి 17 కోట్ల మంది'

ABOUT THE AUTHOR

...view details