ETV Bharat / international

'కరోనా వల్ల తీవ్ర పేదరికంలోకి 17 కోట్ల మంది'

author img

By

Published : Oct 23, 2020, 12:46 PM IST

Updated : Oct 23, 2020, 1:07 PM IST

కొవిడ్​ మహమ్మారి సృష్టించిన ఆర్థిక సంక్షోభంతో సుమారు 15 నుంచి 17.5 కోట్ల మంది తీవ్ర పేదరికంలో కూరుకుపోయే ప్రమాదముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అసంఘటిత రంగం, పర్యావరణంపై ఆధారపడి జీవించేవారే ఇందులో ఎక్కువగా ఉంటారని ఓ నివేదికలో పేర్కొంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు సుస్థిర పర్యావరణం, సామాజిక న్యాయం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని అభిప్రాయపడింది యూఎన్​ఓ.

COVID-19 to push 150-175 million more people into extreme poverty: UN expert
'కరోనా వల్ల తీవ్ర పేదరికంలోకి 17 కోట్ల మంది'

ప్రపంచ దేశాలను కుదుపేసిన కరోనా మహమ్మారి కారణంగా.. సుమారు 15 నుంచి 17.5 కోట్ల మంది తీవ్ర పేదరికం అనుభవించే అవకాశముందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. వర్చువల్​గా జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు మానవ హక్కుల ప్రత్యేక రిపోర్టర్​ ఆలివర్​ డీ ష్కట్టర్​.

తీవ్ర పేదరికంలోకి కూరుకుపోయేవారిలో.. అసంఘటిత రంగం వారే ఎక్కువగా ఉంటారని చెప్పారు ఆలివర్​. వారిలో మహిళలే అధికమని అంచనా వేశారు. పర్యావరణంపై ఆధారపడి జీవనోపాధి సాగించేవారు ఎక్కువగా ప్రభావితమవుతారని ఆయన స్పష్టం చేశారు.

1929 నాటి తీవ్ర ఆర్థిక మాంద్యం లాగే.. ఈసారీ ఆర్థిక వృద్ధిని గణించేందుకు వీలుకాదని ఆలివర్​ పేర్కొన్నారు. అయితే.. ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించేందుకు సుస్థిర పర్యావరణం, సామాజిక న్యాయం వంటివి కీలక పాత్ర పోషిస్తాయని వివరించారు.

ఇదీ చదవండి: 2021 నాటికి కడు పేదరికంలో 15 కోట్ల మంది!

Last Updated :Oct 23, 2020, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.