తెలంగాణ

telangana

Etela Fire on CM KCR: 'రైతుల జీవితాలతో సీఎం కేసీఆర్​ చెలగాటమాడుతున్నారు'

By

Published : Dec 14, 2021, 2:03 PM IST

Etela Rajender: ముఖ్యమంత్రి కేసీఆర్​పై హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఘాటు విమర్శలు చేశారు. సీఎం కేసీఆర్​ నియంత పోకడవల్లే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్‌... ఎందుకు యాసంగి వడ్ల సమస్య పరిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించారు.

Etela Fire on CM KCR
Etela Fire on CM KCR

Etela Fire on CM KCR: రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెలగాటమాడుతున్నారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. నారాయణపేటలో భాజపా జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు ఈటల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి...

రాష్ట్రంలోని సంస్థలను, వ్యవస్థలను సీఎం కేసీఆర్​ నిర్వీర్యం చేసి పాలన సాగిస్తున్నారని ఈటల విమర్శంచారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్‌... ఎందుకు యాసంగి వడ్ల సమస్య పరిష్కరించలేక పోతున్నారని ప్రశ్నించారు. కేంద్రం పేరు చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని... రాష్ట్ర ప్రభుత్వమే నష్టాన్ని భరించి వడ్లను కొనాలని డిమాండ్ చేశారు.

కర్రు కాల్చి వాతపెట్టారు...

ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా హుజూరాబాద్ ఉపఎన్నిక జరిగిందని గుర్తు చేశారు. అవినీతి అక్రమాలకు పాల్పడి రూ. 600 కోట్లు, వివిధ ప్రభుత్వ పథకాల పేరిట రూ. 4 వేల కోట్లను హుజూరాబాద్ ఓటర్లకు ఎరవేసి గెలుస్తామనుకున్న కేసీఆర్​కు... ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టారని విమర్శించారు. అదే గుణపాఠం రాష్ట్రమంతా చెప్పాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని అన్నారు. ఆ సమయం కోసం వేచి చూస్తున్నారని ఈటల తెలిపారు. కార్యకర్తలు ఐక్యమత్యంతో కలిసికట్టుగా పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. అందుకు తన వంతుగా కార్యకర్తలందరికీ అండగా ఉంటానని అన్నారు.

దేశంలో ఏ ధాన్యం వేయాలో తెలియక ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు. గత నాలుగేళ్ల నుంచి రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్​ చెలగాటమాడుతున్నారు. ఒక సారి పత్తి పండించాలంటారు. మరోసారి దొడ్డు వడ్లు వద్దు సన్నవడ్లు పండించాలంటారు. ఇప్పుడేమో అసలు వడ్లే వద్దంటున్నారు. రైతుల ప్రయోజనాలే ముఖ్యమన్న కేసీఆర్‌... ఎందుకు యాసంగి వడ్ల సమస్య పరిష్కరించట్లేదు.-ఈటల రాజేందర్‌, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే

నారాయణపేట భాజపా జిల్లా స్థాయి శిక్షణ తరగతులకు హాజరైన ఎమ్మెల్యే ఈటల

ఇదీ చదవండి:Revanth Reddy on Farmers Suicide : 'రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతోంది'

ABOUT THE AUTHOR

...view details