ETV Bharat / city

Revanth Reddy on Farmers Suicide : 'రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతోంది'

author img

By

Published : Dec 14, 2021, 1:13 PM IST

Revanth Reddy, రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డి

Revanth Reddy on Farmers Suicide : రాష్ట్రంలో రైతుల మరణమృదంగం మోగుతుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్థయాత్రల పేరిట రాష్ట్రాలు పట్టుకొని తిరుగుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సమస్యల పరిష్కారం కోసం ఎన్నోరోజుల నుంచి పడిగాపులు కాస్తున్న అన్నదాత నిరాశతో చివరకు ఆత్మహత్యే శరణమని ప్రాణాలు తీసుకుంటున్నాడని ఆవేదన చెందారు.

Revanth Reddy on Farmers Suicide : రాష్ట్రంలో రైతుల మరణ మృదంగం మోగుతోంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్​ తీర్థయాత్రల్లో బిజీగా ఉన్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రుణమాఫీ లేక.. పంటను కొనుగోలు చేసే నాథుడు లేక కర్షకులు కన్నీళ్లు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి చివరకు పంట అమ్మితే.. ఆ డబ్బు కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సిన దుస్థితి ఎదురైందని వాపోయారు. రైతుల ఇళ్ల ముందు అప్పుల వాళ్లు లొల్లి చేస్తుంటే.. ఆత్మగౌరవం కలిగిన అన్నదాత ఆత్మహత్యే శరణమని ఉరికొయ్యకు వేలాడుతున్నాడని.. పురుగుల మందు తాగి ప్రాణం తీసుకుంటున్నాడని అన్నారు.

Revanth Reddy Tweet Today : రైతుల సమస్యను పరిష్కరించాల్సిన సీఎం కేసీఆర్ తీర్థయాత్రల పేరిట రాష్ట్రాలు తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు బై..బై..కేసీఆర్..​(#BYEBYEKCR) ట్యాగ్​తో ట్వీట్ చేశారు.

Revanth Reddy, రేవంత్ రెడ్డి
రైతుల ఆత్మహత్యలపై రేవంత్ రెడ్డి ట్వీట్

Revanth Reddy Today Tweet : రాష్ట్రంలో పదిరోజుల వ్యవధిలో పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మిరప సాగు చేసి నష్టాల పాలయ్యాయనని.. అప్పుల వాళ్లు ఇంటికొచ్చి పరువు తీస్తున్నారని ఆత్మగౌరవం కలిగిన ఓ అన్నదాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది. తాను వేసిన మిరపపంటకు ఆశించిన దిగుబడి రాదని మనస్తాపానికి గురైన మరో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.

Revanth Reddy Tweet on Farmers Suicide : 'ప్రభుత్వం చెప్పినట్లు సన్నరకం వరి పండిస్తే దిగుబడి తక్కువ వచ్చింది. వచ్చిన పంటకు కనీస మద్దతు ధర లేదు. ఇప్పుడు రబీలో వరి వేయొద్దని చెబుతున్నారు. పుష్కలంగా నీళ్లున్నాయి. నేను కౌలుదారులకు ఏం ఇయ్యాలె. నా తండ్రికి 60 ఏళ్లైనా పింఛను రావడం లేదు. నా కుమారుడు 8 తరగతి చదువుతున్నాడు. అతణ్ని ఇంజినీరింగ్ చదివియ్యాలె.'' అని ముఖ్యమంత్రి కేసీఆర్​కు లేఖ రాసి ఇటీవలే మెదక్ జిల్లాకు చెందిన ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Telangana Farmers Suicide : ఉద్యోగం రాక.. తండ్రికి వ్యవసాయంలో సాయపడదామని సాగు మొదలుపెట్టి అకాల వర్షాలతో పంట నష్టపోయి అప్పులపాలైన ఓ యువరైతు బలవన్మరణానికి పాల్పడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. ఓవైపు మొలకెత్తుతోన్న ధాన్యం.. మరోవైపు కొనుగోలులో అలసత్వం.. ఇంకోవైపు పెరుగుతున్న అప్పులు.. ఇలా వెంటాడుతున్న బాధలతో తీవ్ర మనస్థాపానికి గురైన మరో రైతు.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ములుగు జిల్లా ఏటూరినాగారంలో జరిగింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.