ETV Bharat / crime

Farmer suicide: దిగుబడి రాక.. అప్పులు తీర్చలేక.. రైతు ఆత్మహత్య

author img

By

Published : Nov 29, 2021, 8:00 PM IST

నేల తల్లినే దైవంగా.. అన్నం పెట్టే పంట పొలాలనే ప్రాణంగా భావిస్తూ ఆరుగాలం శ్రమిస్తున్న రైతన్న(Farmer suicide)కు కష్టాలు తప్పడం లేదు. కాలం కలిసిరాక బక్క చిక్కిన బతుకులు.. పుట్టిన ఊరును, వ్యవసాయాన్ని వదులుకోలేక ఆ మట్టితోనే సహవాసం చేస్తున్నాయి. కానీ ప్రతిఫలం మాత్రం ఉరి తాడో, పురుగుల మందో మిగులుతోంది. నలుగురి ఆకలి తీర్చేందుకు ఎండనకా, వాననకా శ్రమిస్తున్న అన్నదాత.. పంట పెట్టుబడి సైతం రాక అప్పుల ఊబి(debt trap)లో కూరుకుపోతున్నాడు. దీనికి తోడు కుటుంబ పోషణ, పశువుల దాణ.. అదనపు భారంగా మారాయి. వీటన్నిటినీ తన బలహీన భుజాలపై మోయలేక చావే శరణ్యమనుకుని బలవన్మరణం చెందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా(sangareddy news)లో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవడం.. వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.

farmer suicide
రైతు ఆత్మహత్య

Farmer suicide: సంగారెడ్డి జిల్లా(sanga reddy dist) జహీరాబాద్​ మండలం అనెగుంట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ భరించలేక సొంత పొలంలోనే చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ రైతు. గ్రామానికి చెందిన ఆగమయ్య(58)కు.. నాలుగెకరాల పొలం ఉంది. ఆయనకు ముగ్గురు పిల్లలు. ఖరీఫ్​లో పొలాన్ని సాగు చేశాడు. ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు(crop loss). పెట్టుబడైనా వస్తే బాగుండేది అని ఆశపడ్డాడు. కానీ అది అడియాస గానే మిగిలింది. అకాల వర్షాలు, పంట తెగుళ్లు ఆగమయ్యను ఇబ్బందులకు గురిచేశాయి. పంట చేతికొచ్చే సమయంలో అనుకోని వర్షాలు నిండా ముంచెత్తాయి. పంట పెట్టుబడికి చేసిన అప్పులన్నీ అలాగే మిగిలాయి. దీనికి తోడు ఇద్దరు కుమార్తెలు, కుమారుడి పెళ్లిళ్లకు చేసిన అప్పులు కూడా వడ్డీతో కలిపి తడిసి మోపెడయ్యాయి.

పదిహేను రోజులుగా

ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలని ఆలోచిస్తూ.. నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు ఆ రైతు. ప్రతి క్షణం ఆందోళనగానే ఉంటున్నాడు. గత పదిహేను రోజులుగా ఆలోచనలు మరీ ఎక్కువై పోయి.. ఇంటి సభ్యుల ముందు గోడును వెళ్లబోసుకున్నాడు. ఆర్థిక కష్టాలు ఎలా గట్టెక్కుతాయని వాళ్లతో చర్చించాడు. కోటి ఆశలతో పొలాన్ని సాగు చేసినా.. తమ బతుకులు మారడం లేదని కలత చెందాడు. ఇన్ని ఆలోచనలతో బతకలేనని అనుకున్నాడో ఏమో.. అప్పుల వాళ్లకు ఎలా ముఖం చూపించాలని బాధపడ్డాడో ఏమో.. కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం ఉదయం బయటకు వెళ్తున్నాని చెప్పి ఆగమయ్య.. ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. నేరుగా పొలానికి వెళ్లాడు. ఇన్ని రోజులు కలియదిరిగిన తన భూమిని తనివి తీరా చూసుకుంటూ.. ఆ నేలలోనే కలిసి పోవాలనుకున్నాడు. తన పొలంలోనే ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

కుటుంబీకుల రోదన

ఉదయం అనగా వెళ్లిన మనిషి.. రాత్రి అయినా ఇంటికి రాకపోయే సరికి(farmer suicide news).. కుటుంబీకులు అంతా గాలించారు. చివరికి తమ పొలంలోనే చెట్టుకు ఉరేసుకుని విగతజీవిగా మారిన అతనిని చూసి అతని కుటుంబీకులు బోరున విలపించారు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న జహీరాబాద్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పుల విషయమై పదిహేను రోజులుగా ఆగమయ్య ఆందోళనగా ఉన్నాడని కుటుంబీకులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇటీవల సైతం అప్పుల బాధ తాళలేక వరి ధాన్యం కుప్ప వద్దే పురుగుల మందు తాగి రైతు బలవనర్మణానికి పాల్పడ్డాడు. రెండు ఎకరాల పొలం అమ్మినా కూడా అప్పులు మాత్రం తీరకపోవడంతో జీవితంపై మీద విరక్తి చెంది ఆత్మ హత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి

ఇదీ చదవండి: Mee Seva Employee Murder case: కత్తులతో నరికి.. శరీరాన్ని 7 భాగాలు చేసి.. ఆపై

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.