తెలంగాణ

telangana

MP Komatireddy: 'చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి'

By

Published : May 25, 2022, 4:32 PM IST

MP Komatireddy: 'చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి'

MP Komatireddy: మంత్రి చేతకానితనం వల్లే నల్గొండ జిల్లాలో అభివృద్ధి కుంటుపడిందని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. దళితుల నుంచి 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను ఆపి చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం కేసీఆర్​ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

'చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి'

MP Komatireddy: నల్గొండ జిల్లాలో మంత్రి చేతకానితనం వల్ల అభివృద్ధి కుంటుపడిందని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట​రెడ్డి విమర్శించారు. సంపాదనే ధ్యేయంగా ఉన్న మంత్రి... కలెక్టరేట్​ నిర్మాణం పేరుతో దళితుల నుంచి 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి వందల కోట్లు సంపాదించాడని ఆరోపించారు. జాజిరెడ్డిగూడెం, వంగమర్తి ఇసుక క్వారీల పేరు మీద రోజూ.. 20 నుంచి 30 లక్షల రూపాయల ఇసుకను తరలిస్తున్నాడని అన్నారు.

ఇప్పుడు ఆయన కన్ను నార్కట్ పల్లి చెరువు మీద పడిందని కోమటిరెడ్డి ఆరోపించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్‌ను ఆపి చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం కేసీఆర్​ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామన్న ఆయన.. అధికారులు స్పందించకుంటే తామే కార్యకర్తలు, గ్రామస్థులతో కలిసి చెరువులో అక్రమంగా వేసిన రోడ్డును తొలగిస్తామన్నారు. ఇలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చెయ్యాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట​రెడ్డి డిమాండ్​ చేశారు.

"మంత్రి చేతకానితనంతో అభివృద్ధి కుంటుపడింది. సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్న మంత్రి.. దళితుల నుంచి 150 ఎకరాల భూమి కొనుగోలు చేసి వందల కోట్లు సంపాదించారు. ఇసుక క్వారీల పేరుతో రోజూ 30 లక్షల ఇసుక దందా చేస్తున్నారు. ఇప్పుడు నార్కట్‌పల్లి చెరువుపై మంత్రి కన్నుపడింది. చెరువులను కబ్జా చేసిన మంత్రిపై సీఎం చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలి." -కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఎంపీ

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details