తెలంగాణ

telangana

తాతంటే ప్రాణం.. అందుకే ఆ మనుమరాళ్లు పాడె మోశారు..!

By

Published : Aug 29, 2021, 9:47 AM IST

సాధారణంగా ఎవరైనా చనిపోతే మగవారు మాత్రమే పాడే మోస్తారు. కానీ తాత మీద ఉన్న మమకారంతో అతని పాడెను... మనుమరాళ్లు మోశారు. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది.

grande-father-crimitions-doing-grande-children
తాతంటే ప్రాణం.. అందుకే ఆ మనుమరాళ్లు పాడె మోశారు..!

చిన్నప్పుడు వేలు పట్టుకొని నడిపించిన తాతంటే వారికి ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆయన పక్కనే పడుకొని చందమాన కథలు విన్న ఆ మనుమరాళ్లకు... ఆయన మరణం పుట్టెడు దుఃఖాన్ని పంచింది. ఇన్నాళ్లు ఆయన కొడుకులు.. వాళ్ల పిల్లలే ఆయన భారాన్ని మోశారు.. ఆడపిల్లలమైన మేము కనీసం ఈ చివరక్షణంలో.. పాడైనైనా మోస్తామంటూ ముందుకొచ్చారు. ఈ మనుమరాళ్లకు తాత మీదున్న ప్రేమను చూసిన బంధువులంతా... అందుకు ఒప్పుకున్నారు.

నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం పరడ గ్రామంలో దండంపల్లి అంజయ్య అనే వ్యక్తి అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయాడు. శుక్రవారం జరిగిన అంతక్రియల్లో అంజయ్య మనుమరాళ్లు, ఆయన సోదరుల మనుమరాళ్లే పాడె మోశారు. మొత్తం ఎనిమిది మంది కలిసి పాడే మోసి తాతపై తమకున్న ప్రేమను చాటుకున్నారు.

తాతంటే ప్రాణం.. అందుకే ఆ మనుమరాళ్లు పాడె మోశారు..!

ఇదీ చూడండి:Schools Reopen: బడిగంటలు మోగే వేళ.. జాగ్రత్తలు పాటిద్దామిలా..

ABOUT THE AUTHOR

...view details