తెలంగాణ

telangana

Beach Volleyball India team Captain : నల్గొండ టూ థాయ్​లాండ్.. బీచ్ వాలీబాల్ కెప్టెన్ ప్రయాణం సాగిందిలా

By

Published : Jun 7, 2023, 2:28 PM IST

Beach Volleyball Indian Team : పేద ఇంటిలో ఆ యువతి మూడో ఆడ సంతానంగా పుట్టింది. ఆమె పుట్టినప్పుడు అందరూ మళ్లీ ఆడపిల్లేనని చాలా అవమానంగా మాట్లాడారు. ఆ పాపని అమ్మేయండని ఉచితసలహాలు ఇచ్చారు . కానీ ఆ తల్లిదండ్రులు అవేమీ పట్టించుకోకుండా కష్టపడి ఆమెని పెంచారు. సీన్‌ కట్ చేస్తే.. బీచ్ వాలీబాల్‌ ఇండియా జట్టు కెప్టెన్‌గా ఎదిగింది ఈ యువతి. మరింత ముందుకు సాగడానికి ఆమెకి ఆటకంగా ఉన్న అవరోధాలేంటి? ఆమె ప్రస్థానం ఎలా సాగుతోంది మీరూ చూసేయండి.

Yuva Story
Yuva Story

బీచ్‌ వాలీబాల్‌లో పసిడిపతకం సాధించిన యువతి

Beach Volleyball India team Captain Aishwarya: 'రాయిలా కూర్చుంటే.. కాలు కదపలేమంటే.. ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం' అనే మాటల స్ఫూర్తితో ఈ యువతి చిన్నప్పటి నుంచి లక్ష్యం కోసం కష్టపడింది. ఆటనే తన ఆశయంగా మార్చుకుంది. లక్ష్య చేధనలో సివంగిలాగా ముందుకు దూకింది. తన పుట్టుకను అవహేళనగా మాట్లాడిన నోళ్లు మూపిస్తూ... జాతీయ అంతర్జాతీయ వాలీబాల్ పోటీల్లో మెరుస్తోంది.

Beach Volleyball India team Captain Story :ఈ వాలీబాల్‌ క్రీడాకారిణి పేరు ఊట్కూరి ఐశ్వర్య. నల్గొండ జిల్లా కట్టంగూర్‌ మండలం బొల్లేపల్లి ఈమె స్వస్థలం. తల్లిదండ్రులకు ముగ్గురు ఆడపిల్లలే. అందరూ హేళన చేసినవారే. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెలనే కొడుకులనుకుని పెంచారు. ఈ అమ్మాయి 8వ తరగతి చదువుతున్న సమయంలో వాలీబాల్ నేర్చుకుంది అదే ఈమె జీవితాన్ని మలుపుతిప్పింది.

అలా పరిచయమైన వాలీబాల్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. పుట్టినప్పుడు అన్న మాటలన్నింటికీ సమాధానం చెప్పాలనుకుంది. నిరంతరం ప్రాక్టీసు చేసింది. చదివిన ప్రతీ సంస్థకు ఆటతో పేరు తెచ్చింది. ప్రతీ చోట తనదైన ముద్రవేస్తూ ముందుకు సాగింది. పేద కుటుంబం నుంచి వచ్చిన తను.. బీచ్‌ వాలీబాల్‌లో జాతీయ జట్టుకు కెప్టెన్‌గా ఎదిగిని తీరును వివరిస్తోంది.

'మా డాడీకిమేము ముగ్గురం ఆడపిల్లలం అయినా సరే కష్టపడి చదివిస్తున్నారు. 3వ సారి కూడా ఆడపిల్ల పుట్టే సరికి ఎందుకు పుట్టింది అన్న ఫీలింగ్​లో ఉండే. నేను 8వ తరగతిలో వాలీబాల్ నేర్చుకోవడం ప్రారంభించాను. అప్పుడే స్టేట్​ లెవెల్​లో ఆడాను. ఉత్తరాఖండ్, ఉత్తర్​ ప్రదేశ్​ , చెన్నై, కేరళ, థాయిలాండ్​ వెళ్లి ఆటలో పాల్గొన్నాను. నా ఆటను చూసే నాకు చాలా మంది జాతీయ స్థాయిలో ఆడాటానికి ఆర్థికంగా సహాయపడ్డారు. ప్రభుత్వం కానీ, దాతలు కానీ నాకు సహాయం చేస్తే నేను ఇంకా ముందుకు వెళ్లగలను.' - ఐశ్వర్య, వాలీబాల్‌ క్రీడాకారిణి

Poor Girl Represented India In Volley Ball Sport :పేద కుటుంబం అయినప్పటికీ తల్లిదండ్రులు, గురువులు ఆటలో చాలా ప్రోత్సహించారు అంటోంది ఐశ్వర్య . ఆట ఆడే విధానం వల్లే గురువుల దృష్టిలో పడ్డానని చెబుతోంది. తన ఆటతీరు తనకు ప్రత్యేక గుర్తింపుతో పాటు చాలాసార్లు ఆర్థికంగా కోచ్‌లు ఆదుకునేలా చేసిందని చెబుతోంది.

బీచ్ వాలీబాల్‌కు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించడం వల్ల సంతృప్తి లభించింది అంటున్న ఐశ్వర్యకు వాలీబాల్ క్రీడలోనూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనే కోరిక ఉంది. దానికోసం నిరంతరం కష్టపడతాను అంటోంది ఈ యువతి. తనకు ప్రభుత్వం సహాయం అందిస్తే కచ్చితంగా మరింత మెరుగ్గా రాణిస్తానని చెబుతోంది.

'ముగ్గురు ఆడపిల్లలే అని చాలా మంది మమ్మల్ని అవమానించారు. మేము కూలీ చేస్తూ మా పిల్లల్ని చదివిస్తున్నాము. నా కూతురు జాతీయ స్థాయిలో ఆడడం గర్వంగా ఉంది. తాను ఉన్నత స్థాయిలోకి ఎదగడానికి ఎంత కష్టమైనా పడతాం. తాను ఇంకా ఎదగాలి అనుకుంటుంది. ఎవరైన సాయం చేస్తే మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తుంది.' కవిత, ఐశ్వర్య తల్లి.

తన పిల్లలు చిన్నప్పటి నుంచి తాము ఎన్నో అవమానాలు ఎదుర్కున్నామని చెబుతోంది ఐశ్వర్య తల్లి. అన్ని అవమానాలను ఎదిరించి తన కూతురు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్‌ గెలవడం గొప్ప విషయమని మురిసిపోతోంది. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తన కూతురు ఆటకు ప్రభుత్వం, దాతలు అండగా నిలవాలని కోరుతోంది.

పోటీ ఏదైనా పతకాలు కొల్లగొట్టడమే తన పని. కళాశాలలో అయినా టోర్నమెంట్లలో అయినా ఎక్కడైనా ఆమెదే హవా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎన్​జీ కళాశాలలో బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న ఐశ్వర్య ఆటలో మరింత ఎదగాలని ఆశిద్దాం.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details