ETV Bharat / state

Director Anshul Singh : లఘు చిత్రాలతోనే అవార్డుల పంట పండిస్తున్న అన్షుల్​ సింగ్​

author img

By

Published : May 8, 2023, 2:01 PM IST

Director Anshul Singh : సినిమా రంగం ప్రతిభావంతులైన యువతకు అవకాశాలు, మంచి పేరు, గుర్తింపు, కాసుల వర్షం కురిపించే రంగం. ఇక్కడ జయాపజయాలతో సంబంధం ఉండదు. కలిసివచ్చే కాలమే పెట్టుబడి.. కథలే ఆస్తులు.. అవకాశాలే అంతస్తులు. అంతిమ లక్ష్యం తాము తీసిన బొమ్మ తెరపై కనిపించడమే. అందుకోసం అహర్నిశలు కష్టపడుతుంటారు. ఈ యువకుడు కూడా ఆ కోవకు చెందిన వాడే. తన ప్రతిభతో మంచి మంచి లఘు చిత్రాలతో అవార్డుల పంట పండిస్తున్నాడు. మరి అతడు తీసిన లఘు చిత్రాలపై మనమూ ఓ లుక్కేద్దామా..

Anshul Singh
Anshul Singh

Young Director Anshul Singh: ఇక్కడ కనిపిస్తున్న ఈ యువ దర్శకుడి పేరు అన్షుల్​ సింగ్​. సినిమాలంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే షార్ట్​ ఫిల్మ్ తీయడం నేర్చుకున్నాడు. ఎంతలా అంటే అవార్డుల పంట పండించేంతలా. అదే తనకు బంగారు భవిష్యత్ను చూపించింది. సాధారణ కుటుంబంలో పుట్టి ఎదగాలన్న సంకల్పంతో.అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు గెలుచుకునే రెంజ్కు చేరుకున్నాడు.

లఘు చిత్రానికే 21 అవార్డులు: హైదరాబాద్​లో పుట్టి ముంబయిలో పెరిగిన అన్షుల్ మాస్ కమ్యూనికేషన్లో ఎంబీఏ పూర్తి చేశాడు. సినిమాలపై అభిరుచితో అన్నపూర్ణ ఫిల్మ్ మేకింగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ప్రాథమిక శిక్షణ తీసుకున్నాడు. 2012లో తన కెరీర్ను మొదలు పెట్టిన అన్షుల్ డాక్యుమెంటరీ ఫిల్మ్స్ పై దృష్టి సారించాడు. మొదట్లో ఎలాంటి వనరులు లేకున్నా తన వద్ద ఉన్న సెల్ ఫోన్​తో మై చాక్లెట్ కవర్ అనే 5 నిమిషాల లఘు చిత్రాన్ని రూపొందించాడు. ఎలాంటి సంభాషణలు లేకుండా నిశ్శబ్దంగా సాగే ఆ లఘు చిత్రంకు హైదరాబాద్​ వేదికగా జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్లో 21 అవార్డులు తెచ్చిపెట్టింది.

సెల్​ఫోన్​తోనే చిత్రం: ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఐదేళ్లు రాత్రి షిఫ్టులలో పని చేస్తూ సినిమాపై ఉన్న పిచ్చితో సెల్​ఫోన్​తోనే లఘు చిత్రాలు తీయడం నేర్చుకున్నాడు. తొలినాళ్లలో తను తీసిన ఎన్నో లఘు చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డుల పంట పండించాయి. అందులో రైతుల ఆత్మహత్యలపై అవగాహన పెంచేలా చేసిన మిట్టి అనే లఘు చిత్రం ఎంతో ప్రత్యేకమైంది. దీన్ని సిక్కింలో ఇప్పటికీ ప్రతి ఆదివారం ప్రదర్శిస్తుండటం విశేషం. అందుకు నాకు వచ్చిన ఆవార్డులు ఎంతో ప్రత్యేకమని చెబుతున్నాడు.

100 పైగా లఘు చిత్రాలు: సామాజిక అంశాలనే కథా వస్తువులుగా చేసుకొని 5 నుంచి 8 నిమిషాల నిడివితో మైక్రో ఫిల్మ్స్ ను నిర్మిస్తూ తన ప్రతిభను చాటుకుంటున్నాడు. 'లపేట్' అనే లఘు చిత్రం 30 ప్రాంతీయ, జాతీయ అవార్డులతో పాటు అంతర్జాతీయ అవార్డులు కూడా అందుకుంది. ఇలా 9 ఏళ్లలో 100కు పైగా లఘు చిత్రాలను రూపొందించాడు అన్షుల్. త్వరలోనే వెండితెరపై తన పేరును చూసుకుంటానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు.

మైక్రో షార్ట్ ఫిల్మ్స్ కూడా: షార్ట్ ఫిల్మ్స్, మైక్రో ఫిల్మ్స్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్​లో ఒక్కొక్క అడుగు ముందుకేస్తోన్న అన్షుల్, అవుట్పుట్ మీడియా అనే అంకుర సంస్థను స్థాపించాడు. దాంతో గత 5 ఏళ్లల్లో ఒంటరిగానే సుమారు 600కు పైగా ప్రాజెక్టులు పూర్తి చేశాడు. అన్షుల్ సినీ ప్రయాణాన్నిచూస్తున్న వారు భుజం తడుతున్నారు. ఇప్పుడు సాహిత్యం, పురాతన గ్రంథాలు, చారిత్రక విశేషాలతో కూడిన రచనల నుంచి మైక్రో ఫిల్మ్స్ తయారుచేయాలన్న ఆలోచన అన్షుల్​కు ఉంది. అదే ఆలోచన మంచి ఫలితాలను ఇస్తుందని దర్శకుడు విజయ్ కలివరపు అంటున్నాడు.

త్వరలో వెండితెరపై: ప్రేక్షకుడిని థియేటర్​తు రప్పించాలంటే దర్శకుడిలో సత్తా ఉండాలంటాడు అన్షుల్. అందుకోసం పరిశోధన చాలా అవసరమని అంటున్నాడు. వెండితెరపై వందేభారత్​ ఎక్స్​ప్రెస్​లా దూసుకుపోవాలనేదే తన ధ్యేయమని అందుకోసం ఎంతటి కష్టానికైనా తాను సిద్ధంగా ఉన్నాని చెబుతున్నాడు. మరి, అన్షుల్​ సింగ్​ కలలు నిజం కావాలని మనమూ ఆల్​ ది బెస్ట్​ చెప్పేద్దాం...

ఇవీ చదవండీ:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.