తెలంగాణ

telangana

GHMC Mayor: 'పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలి'

By

Published : Jun 15, 2021, 2:38 PM IST

వర్షకాలంలో వరదలతో నగరవాసులు ఇబ్బందులు పడకుండా... పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జీహెచ్​ఎంసీ మేయర్​ విజయలక్ష్మి ఆదేశించారు. మల్కాజిగిరిలోని పలు డివిజన్లలో ఆమె పర్యటించారు.

ghmc-mayor-vijayalakshmi-inspected-the-canals
GHMC Mayor: పూడికతీత పనులు త్వరితగతిన పూర్తి చేయాలి

హైదరాబాద్‌లోని నాలాల్లో పూడికతీత పనులు త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు జీహెచ్​ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి(GHMC Mayor Gadwala Vijayalakshmi) సూచించారు. వర్షకాలంలో వరదలతో నగరవాసులు ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు.

మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరిలోని పలు డివిజన్లలో నాలాలను మేయర్‌ పరిశీలించారు. భారీ వర్షాలకు ముందే తగు జాగ్రత్తలు చేపట్టాలని అధికారులకు సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్న మేయర్‌... వివిధ శాఖల సమన్వయంతో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. గతేడాది వరదల సమయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని... అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని తెలిపారు.

ఇదీ చూడండి: Viral: బైక్​పై వచ్చి తుపాకీతో హల్​చల్​

ABOUT THE AUTHOR

...view details