తెలంగాణ

telangana

నర్సాపూర్‌లో భారీ వర్షం... ఇళ్లలోకి నీరు

By

Published : Oct 11, 2020, 4:03 PM IST

ఎడతెరిపి లేకుండా కురిసిన వానతో మెదక్ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి ఇళ్లలోకి చేరింది. చిన్న వానొచ్చినా తమకు ఈ పరిస్థితి తప్పడం లేదని స్థానికులు వాపోయారు. వర్షం వస్తే వణుకు అన్నట్లుగా పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

heavy rain at narsapur in medak district
నర్సాపూర్‌లో భారీ వర్షం... ఇళ్లలోకి నీరు

మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి కురుస్తోన్న వానతో నర్సాపూర్‌ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వీధుల్లో, ఇళ్లలో నీరు చేరింది. చిన్నపాటి వర్షం కురిసినా ఈ ఇబ్బందులు తప్పడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా శాశ్వత పరిష్కారం చూపడం లేదని వాపోయారు.

వర్షం వస్తే వణుకే...

మురుగు కాలువలు నిర్మిస్తే నీరు సాఫీగా పోతుందని అన్నారు. శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని చెప్పారు. వర్షం వస్తే వణుకు అన్నట్లుగా తమ పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బయటకు వెళ్తే ఇంటికి రావడం కష్టంగా మారిందని వాపోయారు.

ఇదీ చదవండి:హైదరాబాద్​లో వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ABOUT THE AUTHOR

...view details