ETV Bharat / state

హైదరాబాద్​లో వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

author img

By

Published : Oct 11, 2020, 1:00 PM IST

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్​లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచింది. కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్​ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురిసింది.

heavy rain at kukatpalli, kuthubullapur areas in hyderabad
హైదరాబాద్​లో ఎడతెరపిలేకుండా వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉదయం 9:30 గంటల నుంచి కూకట్​పల్లిలోని పలు ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా భారీ వర్షం పడింది. వర్షపు నీటితో రోడ్లన్ని జలమయమయ్యాయి. వాహనదారులు కొంతమేర ఇబ్బంది పడ్డారు.

కూకట్​పల్లిలోని హైదర్​నగర్ ,కేపీహెచ్​బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, వివేకానంద నగర్, బాలాజీ నగర్, మూసాపేట్, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏకదాటిగా వర్షం కురిసింది. బయటకు వచ్చిన ప్రయాణికులు వర్షపునీటిలో అవస్థలు పడాల్సి వచ్చింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడీమెట్ల, కొంపల్లి , బాలానగర్, చింతల్ ప్రాంతాల్లో భారి వర్షం పడింది.

హైదరాబాద్​లో ఎడతెరపిలేకుండా వర్షం.. పలు ప్రాంతాలు జలమయం

ఇదీ చూడండి:'దిశ ఎన్​కౌంటర్'ను​ సినిమాగానే చూడండి: నట్టి కుమార్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.