తెలంగాణ

telangana

కమ్ముకున్న పొగమంచు.. భవనాల పైనుంచి ఆస్వాదించిన స్థానికులు

By

Published : Oct 23, 2020, 10:25 AM IST

కమ్ముకున్న పొగమంచు.. భవనాల పైనుంచి ఆస్వాదించిన స్థానికులు

తెల్లారిన కాసేపటికి.. పొగమంచు ఒక్కసారిగా.. కమ్ముకోవడం వల్ల మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని పరిసర ప్రాంతాలు పొగమంచుతో నిండుకున్నాయి. భవనాలు రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడింది. వాహనదారులు లైట్లు వేసుకుని ముందుకు సాగడం పొగమంచు తీవ్రతను సూచిస్తోంది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండల పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు పొగ మంచుతో నిండి పోయింది. 8 గంటల కన్నా ముందు మామూలుగా ఉన్న వాతావరణం.. ఎనిమిది తర్వాత ఒక్కసారిగా పొగమంచు ఆవహించింది. దీంతో పట్టణ వాసులంతా భవనాల పైకెక్కి ఏం జరుగుతుందో అని ఆశ్చర్యంగా పొగమంచు చూస్తూ ఉండిపోయారు.

పొగమంచు వల్ల ఉదయాన్నే లైట్లు వేసుకోని వెళ్తున్న వాహనదారులు

167వ జాతీయ రహదారిపై రాకపోకలకు కొంత ఇబ్బంది నెలకొంది. వాహనదారులు లైట్లు వేసుకుని నెమ్మదిగా ముందుకు సాగారు. దేవరకద్రలోని రైల్వే స్టేషన్, చుట్టూ ఉన్న భవనాలు కనిపించకపోవడం వల్ల పట్టణ వాసులు ఓ గంట సేపు ఆశ్చర్యంగా చూస్తూ.. స్మార్ట్ ఫోన్​తో.. ఫోటోలు, వీడియోలు, సెల్ఫీలు తీసుకుంటూ ఆనందంగా గడిపారు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత నెమ్మదిగా పొగమంచు తగ్గడం వల్ల పట్టణ వాసులు ఊపిరి పీల్చుకున్నారు.

దుప్పటిలా కప్పేసినా పొగమంచు

ఇదీ చదవండి:దట్టమైన పొగమంచుతో వాహనదారుల ఇక్కట్లు

ABOUT THE AUTHOR

...view details