తెలంగాణ

telangana

బొగ్గు ఉత్పత్తిలో కొత్త రికార్డులు క్రియేట్ చేసిన సింగరేణి

By

Published : Apr 2, 2023, 2:15 PM IST

Illandulu Coal Production Station: సింగరేణి ఇల్లందు ఏరియాకు సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని 27 రోజుల ముందే అధిగమించినట్లు ఏరియా జీఎం ఎం.షాలేము రాజు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇల్లెందు ఏరియాకు 45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా నిర్దేశించగా.. అన్ని అవాంతరాలను అధిగమిస్తూ.. 108 శాతం మేర 48.79 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామన్నారు.

Illandulu Coal
Illandulu Coal

Illandulu Coal Production Station: సింగరేణి పుట్టినిల్లుగా ఉన్న ఖమ్మంలోని ఇల్లందు ఏరియా సంస్థ నిర్దేశించిన వార్షిక లక్ష్యాన్ని 27 రోజుల ముందే అధిగమించినట్లు ఏరియా జీఎం ఎం.షాలేము రాజు తెలిపారు. స్థానిక జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన అనంతరం మాట్లాడారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఇల్లందు ఏరియాకు 45 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా సంస్థ నిర్దేశించిందని తెలిపారు.

అన్ని అవాంతరాలను అధిగమిస్తూ అనుకున్న తేదీ కంటే ముందుగా 108 శాతం మేర 48.79 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామన్నారు. మార్చి నెలలో 3.08 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం కాగా.. 141 శాతం అంటే 4.34 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశామని తెలిపారు. 5.71 లక్షల టన్నుల బొగ్గు బట్వాడా చేశామని.. ఇందులో 95 రేకుల బొగ్గును రవాణా చేశామన్నారు.

కార్మికులకు మిఠాయిల పంపిణీ..:సింగరేణి జేకే 5 ఉపరితల గనిలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి 14.50 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాల్సి ఉండగా.. 18.79 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినందుకు జీఎం ఎం.షాలేము రాజు కార్మికులకు మిఠాయిలు పంచి అభినందనలు తెలిపారు.

ప్రజాభిప్రాయ సేకరణ: సింగరేణి జేకే 5 ఉపరితల నూతన విస్తరణ గని ఏర్పాటుకు అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేశామని జీఎం తెలిపారు. అటవీశాఖ అనుమతులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఆగస్టు నెలలో బొగ్గు ఉత్పత్తి ప్రారంభం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఉపరితల గని విస్తరణలో భాగంగా ఈనెల 26వ తేదీన స్థానిక 24 ఏరియా మైదానంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామని.. ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు.

"ఇల్లందు ఏరియాకి మార్చి నెలలో 3.08 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. అనుకున్న దాని కంటే ఎక్కువగా 4.34 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేశాం. అందుకు కృషి చేసిన ఇల్లందు ఏరియాలో పని చేసే కార్మికులు, అధికారులు, సూపర్ వైజర్​లకు నా అభినందనలు తెలియజేస్తున్నా. మొదట్లో అనేక అవాంతరాలు అధిగమించి ఇప్పుడు ఇల్లందులో బొగ్గు ఉత్పత్తి చేస్తున్నాం. ఉపరితల గని విస్తరణలో భాగంగా ఈ నెల 26వ తేదీన స్థానిక 24 ఏరియా మైదానంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. ప్రజలు పాల్గొని సందేహాలు నివృత్తి చేసుకోవాలని కోరుతున్నాం".- ఎం షాలేము రాజు​, ఇల్లందు ఏరియా జీఎం

ఇవీ చదవండి:

దూసుకుపోతున్న సింగరేణి.. ఆల్​టైం రికార్డు ఇదే.!

సింగరేణిని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం: ఎమ్మెల్సీ కవిత

శ్రీధర్‌ను సీఎండీగా కొనసాగించడం వెనుక ఆంతర్యమేంటి: రేవంత్​రెడ్డి

ABOUT THE AUTHOR

...view details