తెలంగాణ

telangana

మట్టి గణపతినే పూజిద్దాం: ఎమ్మెల్యే

By

Published : Sep 2, 2019, 9:45 PM IST

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు మట్టి గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. అందరూ మట్టితో చేసిన వినాయక ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు.

మట్టి గణపతినే పూజిద్దాం: ఎమ్మెల్యే

వినాయక చవితి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్ దంపతులు మట్టి గణపతి విగ్రహన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక చవితి ప్రకృతితో మమేకమైన పండుగని, పర్యావరణానికి ఎలాంటి హాని కలగకుండా అందరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని, ప్రకృతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రైతులు, మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని ఆ గణనాథుని వేడుకున్నట్లు వెల్లడించారు.

మట్టి గణపతినే పూజిద్దాం: ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details