తెలంగాణ

telangana

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం

By

Published : Sep 26, 2020, 5:10 PM IST

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు మహబూబాబాద్ జిల్లావ్యాప్తంగా పలు వాగులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. జిల్లాలోని మున్నేరు, పాకాల, వట్టి వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.

Heavy Rain in Mahabubabad District
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు.. రాకపోకలకు అంతరాయం

రెండు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాలకు మహబూబాబాద్​ జిల్లాలోని చెరువులు నిండి.. వాగులు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలోని మున్నేరు, పాకాల, వట్టి వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కేసముద్రం మండలం అర్పణపల్లి శివారులోని వట్టివాగు, కేసముద్రం - గుడూరు మండల కేంద్రాల మధ్య గల పాకాల వాగు పొంగి ప్రవహిస్తుండటం వల్ల గార్ల మండలకేంద్రం నుంచి మద్దివంచ,రాంపురం గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం వల్ల ఆ మార్గంలో ఎవరూ ప్రయాణించకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్షపు నీరు నిలవడం వల్ల పసుపు, మిరప, పత్తి పంటలు దెబ్బతిన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:అశ్రునయనాలతో బాలూకు అంతిమ వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details