తెలంగాణ

telangana

'రైతులకు అండగా నిలుస్తూ... ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది'

By

Published : Oct 9, 2020, 6:27 PM IST

రైతులకు అండగా నిలుస్తూ... వారి సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. కొమురం భీం జిల్లాలో... కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహించిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

trs rally at kumara bheem asifabad district to thank cm
'రైతులకు అండగా నిలుస్తూ... ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టింది'

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్​కు కృతజ్ఞతలు తెలుపుతూ ట్రాక్టర్లు, ద్విచక్రవాహనాలతో తెరాస శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.

ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తూ... వారి సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంత ప్రజలకు మిషన్ భగీరథతో తాగునీరు అందించి... వారి కష్టాలు తీర్చారని తెలిపారు. త్వరలో రూ.40 కోట్లతో జిల్లాలో అభివృద్ధి పనులు చేపట్టనున్నామని వెల్లడించారు. ఎల్ఆర్ఎస్​కు, 1/70 చట్టంలో ఉన్న ఏజెన్సీ భూములకు ఎలాంటి సంబంధమూ లేదని మంత్రి తెలిపారు. అటవీ ప్రాంతంలో సాగు చేసుకుంటున్న పోడు భూములకు... పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పేర్కొన్నారు.

ఇదీ చూడండి:రైతు బాంధవుడు సీఎం కేసీఆర్‌: మంత్రి సబిత

ABOUT THE AUTHOR

...view details