తెలంగాణ

telangana

'బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే నాడు కాంగ్రెస్​ ప్రత్యేక తెలంగాణ ఇచ్చింది'

By ETV Bharat Telangana Team

Published : Nov 8, 2023, 3:17 PM IST

BRS Praja Ashirvada Sabha at Kagaznagar : ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటేయాలని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​ అన్నారు. ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు మాత్రమే ఓటేయాలని సూచించారు. నాడు బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే కాంగ్రెస్​ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని తెలిపారు. కాగజ్​నగర్​లో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ పాల్గొని.. ప్రసంగించారు.

cm kcr brs praja ashirvada sabha
cm kcr brs praja ashirvada sabha

BRS Praja Ashirvada Sabha at Kagaznagar : బీఆర్​ఎస్​ పోరాటానికి భయపడే కాంగ్రెస్​ నేతలు ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని బీఆర్​ఎస్​ అధినేత, సీఎం కేసీఆర్​(CM KCR) తెలిపారు. తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్​ సచ్చుడో అన్నట్లు తాను పోరాడానన్నారు. కాగజ్​నగర్​లో జరిగిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లో పాల్గొన్న కేసీఆర్​.. ప్రసంగించారు. అనంతరం కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణితి రావాలంటే.. ఎన్నికల వేళ ప్రజలు విచక్షణతో ఓటేయాలని సీఎం కేసీఆర్​ కోరారు. ఎన్నికల్లో సేవ చేసే వ్యక్తులకు ఓటు వేయాలని సూచించారు. రైతులు, పేదల గురించి ఆలోచించే వారికి ఓటు వేయండని అన్నారు. ప్రజల వద్ద ఉన్న ఓటే వజ్రాయుధమని వివరించారు. మనం వేసే ఓటు.. భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. 2004 ఎన్నికలకు ముందు తెలంగాణ ఇస్తామని కాంగ్రెస్​ హామీ ఇచ్చిందని.. ఎన్నికలు అవ్వగానే కాంగ్రెస్​ ఇచ్చిన హామీని విస్మరించిందన్నారు.

పోడు భూముల పట్టాల పంపిణీకి కేంద్రం అడ్డంకిగా మారిందని సీఎం కేసీఆర్​ విమర్శించారు. రైతుబంధు(Rythu Bandhu) దుబారా అని కాంగ్రెస్​ నేతలు అంటున్నారని గుర్తు చేశారు. 24 గంటల కరెంటు ఇవ్వడం వృథా అంటూ రేవంత్​ రెడ్డి అంటున్నారని.. వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరిపోతుందా అంటూ అక్కడ సభలో ఉన్నవారిని ప్రశ్నించారు. భూవివాదాలు ఉండకూడనే ధరణి(Dharani Portal) పోర్టల్​ తీసుకొచ్చామన్నారు. కాంగ్రెస్​ హయాంలో లంచం ఇస్తేనే రిజిస్ట్రేషన్లు జరిగేవని నాటి రోజులను గుర్తుకు చేసుకున్నారు.

ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్‌

CM KCR Speech at Kagaznagar Sabha :ప్రస్తుతం ఎలాంటి లంచాలు ఇవ్వకుండానే అర్ధగంటలోనే రిజిస్ట్రేషన్లు పూర్తి అవుతున్నాయని హర్షించారు. ధరణిని బంగాళఖాతంలో వేస్తామని కాంగ్రెస్​ నేతలు అంటున్నారని ఆరోపించారు. ధరణి తీసేస్తే రైతుబంధు, రైతుబీమా, ధాన్యం కొనుగోళ్ల డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ పోర్టల్​ను తీసేయడం వల్ల రైతులకు భూములపై ఉన్న హక్కులు పోయి.. మళ్లీ దళారుల వ్యవస్థ వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో తండాలకు సైతం శుద్ధమైన నీరు వస్తున్నాయని సీఎం కేసీఆర్​ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఒక్కొక్క విద్యార్థిపై రూ.1.25 లక్షలు ఖర్చు పెడుతున్నామని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత భూములు ధరలు పెరిగాయని వెల్లడించారు. నీటి సదుపాయాలు కల్పించినందునే భూములు ధరలు పెరిగాయని వివరించారు. రైతులకు ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే రైతుబంధు ఇస్తున్నామని స్పష్టం చేశారు.

BRS Public Meeting at Kagaznagar :బీఆర్​ఎస్​ చేసిన అభివృద్ధిపై గ్రామాల్లో చర్చలు జరపండని సీఎం కేసీఆర్​ ప్రజలకు సూచించారు. పదేళ్లలో రాష్ట్రంలో ఎక్కడా కర్ఫ్యూ లేదంటూ చెప్పారు. కాంగ్రెస్​ హయాంలో మైనారిటీలకు రూ.900 కోట్లు కేటాయించారని.. అదే బీఆర్​ఎస్​ హయాంలో మైనారిటీలకు రూ.12వేల కోట్లు కేటాయించామని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 93 లక్షల కుటుంబాలకు తెల్ల రేషన్​ కార్డులు ఉన్నాయని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి రేషన్​ కార్డు ఉన్నవారందరికీ సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు.

మోరాయించిన సీఎం కేసీఆర్​ హెలికాప్టర్​ :కాగజ్​ నగర్​లో సభ ముగిసిన అనంతరం ఆసిఫాబాద్​ వెళ్లేటప్పుడు హెలికాప్టర్​ మోరాయించడంతో రోడ్డు మార్గం ద్వారా బస్సులో ఆసిఫాబాద్​ చేరుకుంటున్నారు. దీంతో ఆసిఫాబాద్​లో జరగాల్సిన బీఆర్​ఎస్​ ప్రజా ఆశీర్వాద సభ కాస్త ఆలస్యంగా ప్రారంభం కానుంది.

గద్వాల ప్రాంతాన్ని గబ్బు పట్టించింది కాంగ్రెస్​ పార్టీ కాదా : కేసీఆర్

'ఓటర్లు పరిణితితో ఓటేస్తే ప్రజాస్వామ్యం గెలుస్తుంది - సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌ ఉంటుంది'

ABOUT THE AUTHOR

...view details