ETV Bharat / state

ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్‌

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 3:46 PM IST

CM KCR Public Meeting Nirmal Today : తెలంగాణ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న సీఎం కేసీఆర్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. మొదటగా నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఈ సభా వేదికగా కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. అభివృద్ధి కొనసాగాలంటే రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

CM KCR
CM KCR

ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం

CM KCR Public Meeting Nirmal Today : తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బీఆర్ఎస్ పుట్టిందని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామని తెలిపారు. పదేళ్లు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించారని.. మరో పదేళ్లు ఆశీర్వదించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ నియోజకవర్గంలో ఇవాళ కేసీఆర్ పర్యటించారు. అక్కడ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించారు.

CM KCR Fires on Congress in Nirmal Meeting : నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధించుకున్నామని.. ఆ ఆశయాలు ఇప్పటికే నెరవేరాయని సీఎం కేసీఆర్ చెప్పారు. కేవలం ఇవే కాకుండా తొమ్మిదన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ వన్‌గా మారిందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తాను హామీ ఇచ్చినవే కాకుండా.. మాటివ్వని హామీలు కూడా నెరవేర్చామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ ప్రవేశపెట్టిన పథకాలు.. రూపొందిస్తున్న కార్యక్రమాలను ఇప్పుడే దేశం పాటిస్తోందని అన్నారు.

BRS Praja Ashirvada Sabha at Sathupalli : ఖమ్మం ప్రజలు ఏపీ తెలంగాణ రోడ్లను చూస్తే అభివృద్ధి ఎలా ఉందో తెలుస్తుంది మళ్లీ గెలిచేది మనమే

"తెలంగాణ రాకపోతే నిర్మల్‌.. జిల్లా అయ్యేదా? నిర్మల్‌ జిల్లా కావాలని ఇంద్రకరణ్‌ రెడ్డి తపనపడ్డారు. నిర్మల్‌కు మెడికల్‌ కాలేజీ వస్తుందని ఏనాడైనా అనుకున్నామా? ఇంద్రకరణ్‌ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలి. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నాం. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు స్కీమ్‌ తెచ్చాం. 24 గంటలూ నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నాం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా వరకు విద్యుత్ కష్టాలున్నాయి. మొన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలోనూ కరెంట్ కోతలే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీరు ఈ రెండు పార్టీల్లో దేనికైనా ఈ ఎన్నికల్లో అవకాశం ఇస్తే మన తెలంగాణలో కూడా కరెంట్ కోతలు తప్పవు. మోటార్లకు మీటర్లూ తప్పవు." - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

KCR Speech at Nirmal Meeting Today : నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నామని కేసీఆర్ అన్నారు. ఎన్నికల సంఘం అధికారులు అనుమతిస్తే రైతు రుణ మాఫీ ఇప్పుడే ఇస్తామని చెప్పారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్‌ కుమార్ అంటున్నారని.. రైతులకు 3 గంటల కరెంటు చాలని రేవంత్‌ రెడ్డి అంటున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం ఆరాటపడుతూ.. వారి అభివృద్ధే పరమావధిగా భావిస్తూ వారి పురోగతికి బీఆర్ఎస్ కట్టుబడి ఉందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.

CM KCR Election Campaign 2023 : "టాప్​గేర్​లో కేసీఆర్ ప్రచార సభలు.. కాంగ్రెస్ వస్తే ఇబ్బందులు తప్పవని మండిపాటు"

CM KCR on Dharani Portal : ధరణి తీసేస్తే.. రైతు బంధు, రైతు బీమా కూడా పోతాయని కేసీఆర్ తెలిపారు. ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని పేర్కొన్నారు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని.. అభివృద్ధి కొనసాగాలంటే.. మళ్లీ బీఆర్ఎస్‌ను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. కారు గుర్తుకు ఓటువేస్తే రాష్ట్రంలో జెడ్ స్పీడ్‌లో అభివృద్ధి దూసుకెళ్తుందని వ్యాఖ్యానించారు.

పక్కా వ్యూహాలతో ఎన్నికల రణక్షేత్రంలో దూసుకెళ్తున్న బీఆర్​ఎస్​ ఈ ప్లాన్​ చూస్తే హ్యాట్రిక్​ కొట్టేలాగే కనిపిస్తుందిగా

'దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య పోటీ అంటూ రాహుల్ గాంధీ పెద్ద పెద్ద మాటలు చెబుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.