ETV Bharat / state

ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది : సీఎం కేసీఆర్

author img

By ETV Bharat Telangana Team

Published : Nov 2, 2023, 4:29 PM IST

Updated : Nov 2, 2023, 4:51 PM IST

CM KCR Public Meeting in Balkonda Today : మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. సంస్కరణల పేరుతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించడమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు చెప్పినట్లుగా చేయనందుకు రాష్ట్రానికి రావల్సిన లక్ష కోట్ల రూపాయలను మోదీ సర్కార్ ఆపేసిందని కేసీఆర్ బాల్కొండ సభలో చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్​తో తెలంగాణకు వచ్చేది ఏం లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.

CM KCR
CM KCR Public Meeting in Balkonda

ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుంది సీఎం కేసీఆర్

CM KCR Public Meeting in Balkonda Today : ప్రధాని మోదీకి ప్రైవేటీకరణ పిచ్చి పట్టుకుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు ప్రైవేటుపరం చేసిన మోదీ.. సంస్కరణల పేరిట విద్యుత్ రంగాన్ని కూడా ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతుల మోటార్లకు మీటర్లు పెట్టాలని మోదీ ఒత్తిడి చేస్తున్నారని.. చచ్చినా... రైతుల మోటార్లకు మీటర్లు పెట్టనని కేంద్రానికి తేల్చి చెప్పానని స్పష్టం చేశారు. మోటార్లకు మీటర్లు పెట్టనందుకు కేంద్రం తెలంగాణకు ఇవ్వాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వలేదని వెల్లడించారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. బాల్కొండలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు.

ఈసీ అనుమతిస్తే రైతు రుణమాఫీ ఇప్పుడే ఇస్తాం : కేసీఆర్‌

"నష్టం వచ్చినా.. వరి, జొన్న వంటి పంటలు కొంటున్నాం. ధాన్యం అమ్మిన వారంలోనే రైతులకు డబ్బులు ఖాతాల్లో వేస్తున్నాం. మనదేశంలో ప్రజాస్వామ్య పరిణతి ఇంకా పెరగటం లేదు. ఎన్నికలు రాగానే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎన్నికల్లో ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని భావిస్తున్నారు. ఏమరుపాటుగా ఓటు వేస్తే.. మన భవిష్యత్‌ ఆగం అవుతుంది. ఒక్క అవకాశం ఇవ్వమని ఇవాళ కాంగ్రెస్ అడుగుతోంది. కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం కాదు.. 11 అవకాశాలు ఇచ్చారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ దేశానికి, రాష్ట్రానికి ఏం చేసిందో ఆలోచించాలి. 2014కు ముందు రాష్ట్రంలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలి. దేశంలో తెలంగాణ మాత్రమే 24 గంటల కరెంట్ ఇస్తోంది. చిన్న రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ.. తలసరి విద్యుత్ వినియోగంలో ముందుంది." - కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి

35 మందితో బీజేపీ మూడో జాబితా విడుదల

కాంగ్రెస్ వస్తే కరెంట్ కోతలు తప్పవు బాల్కొండ సభలో కేసీఆర్

CM KCR on Dharani Portal in Balkonda : ధరణి వల్ల భూముల రిజిస్ట్రేషన్లలో దళారులు లేకుండా పోయారని సీఎం కేసీఆర్ తెలిపారు. ఎవరూ అడగకుండానే రైతుబంధు తీసుకువచ్చానని చెప్పారు. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల వరి పండుతోందని.. మిగతా ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్ల టన్నుల ధాన్యం పండిస్తామని వెల్లడించారు. తెలంగాణలో కరెంట్‌, సాగునీరు సమస్య పరిష్కరించుకున్నామన్న సీఎం.. యాదాద్రి పవర్‌ ప్లాంట్‌ పూర్తయితే.. తెలంగాణలో ఎప్పటికీ విద్యుత్ సమస్య రాదని స్పష్టం చేశారు. 17 రాష్ట్రాల్లో బీడీ కార్మికులు ఉన్నారని.. ఎక్కడైనా పింఛను ఇస్తున్నారా? అని ప్రశ్నించారు.

'గత 75 ఏళ్లుగా జరగలేని అభివృద్ధిని తొమ్మిదిన్నర ఏళ్లలో చేసి చూపించాం'

'రైతుబంధు, దళితబంధు అనే పదాలు పుట్టించిందే నేను. నెహ్రూ సరిగ్గా ఆలోచించి ఉంటే.. ఎస్సీల జీవితాలు ఎప్పుడో మారిపోయేవి. దళితబంధు పథకం నా మానసపుత్రిక. తలసరి ఆదాయంలో తెలంగాణ ఇవాళ నంబర్‌వన్‌గా ఉంది. తలసరి విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా ఉంది. రైతుబంధు ఇచ్చి ప్రజల సొమ్ము దుబారా చేస్తున్నానని కాంగ్రెస్‌ నేతలు అంటున్నారు. రైతుబంధు ఉండాలో.. వద్దో ప్రజలు ఆలోచించాలి. కాంగ్రెస్‌ గెలిస్తే.. రైతుబంధుకు రాంరాం.. కరెంట్‌ కాటిలో కలుస్తది.' అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

తెలంగాణ గడ్డపై జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ వ్యూహాలు

Last Updated :Nov 2, 2023, 4:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.