తెలంగాణ

telangana

సింగరేణి ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటా: ఎమ్మెల్సీ కవిత

By

Published : Apr 1, 2021, 5:46 AM IST

సింగరేణిలోని ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు.. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితను కలిశారు. పెండింగ్​లో ఉన్న ఉద్యోగాల భర్తీ చేపట్టేలా కృషి చేయాలని ఆమెను కోరారు.

mlc kavitha
సింగరేణి ఉద్యోగాల భర్తీ

సింగరేణిలో.. పెండింగ్​లో ఉన్న 665 ఎస్టీ బదీలీ వర్కర్ల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక చొరవ తీసుకుంటానని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. సింగరేణి ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు.. ఎంపీ మాలోత్ కవితతో కలిసి.. హైదరాబాద్​లో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు కవితను కలిసి సమస్యను విన్నవించుకున్నారు. 2018లో పరీక్ష రాసిన సుమారు 28 వేల మంది గిరిజన యువత.. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తోందని వివరించారు.

కోర్టు ఆదేశాల మేరకు.. సింగరేణి భూ నిర్వాసితులకూ ఉద్యోగాలు కల్పించాలని సంఘం ప్రతినిధులు కోరారు. సింగరేణి యాజమాన్యంతో చర్చించి.. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని.. కవిత వారికి హామి ఇచ్చారు.

ఇదీ చదవండి:విధి నిర్వహణలో ఏఎస్​ఐ మృతి... అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details