తెలంగాణ

telangana

'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

By

Published : Nov 21, 2019, 3:32 PM IST

ఒకప్పుడు ప్రభుత్వ వైద్యుడిగా విధులు నిర్వర్తిస్తూ  ఎందరికో ప్రాణాలు పోశాడు. రిటైర్​ అయ్యాక కూడా తనకు వీలైనంత మందికి ఆరోగ్యాన్ని పంచుతూ రుగ్మతలను తొలిగిస్తున్నాడు.

RETIRED DOCTOR TEACHING EXERCISE TO 300 PEOPLE FOR FREE AT KARIMNAGAR

కరీంనగర్​కు చెందిన విశ్రాంత ప్రభుత్వ వైద్యుడు డా. మల్లేశం పదవి విరమణ అనంతరం ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నాడు. వేకువజామునే 5 గంటలకు మైదానానికి చేరుకొని స్థానికులకు ఉచితంగా వ్యాయామం నేర్పిస్తున్నాడు. శాతవాహన విశ్వవిద్యాలయం మైదానంతో పాటు ఎస్.ఆర్.ఆర్ కళాశాల మైదానంలో దాదాపు 300 మంది స్థానికులకు వ్యాయామ గురువుగా మారారు. తన చివరి శ్వాస వరకు వైద్యంతో పాటు అన్ని ఉచితంగా అందిస్తానంటున్నాడు వైద్యుడు మల్లేశం.

మల్లేశం చెప్తున్న చిట్కాలతో తమ రుగ్మతలు తొలిగిపోయాయని వాకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. వైద్యుడు మల్లేశం 59వ పుట్టినరోజు సందర్భంగా శాలువాలతో సత్కరించుకున్నారు.

'చివరి శ్వాస వరకు ఉచితంగా వైద్యం అందిస్తా...'

ఇవీ చూడండి: సీఎం గారూ ఆర్టీసీ కార్మికులను చేర్చుకోండి: పవన్​ కల్యాణ్

TAGGED:

ABOUT THE AUTHOR

...view details